ప్రత్యేక హోదాపై బీజేపీ చేతులెత్తేశాక.. ఏపీకి బడ్జెట్ ఊరటనివ్వలేదా?

ప్రధానంగా రాష్ట్ర విభజన అనంతరం... ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పిన అనంతరం వచ్చిన ఈ బడ్జెట్ పైన ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

విజయవాడ: అరుణ్ జైట్లీ బుధవారం నాడు ప్రవేశ పెట్టిన సామాన్యులకు ఊరటనిచ్చింది. ఆదాయపన్ను పరిమితి మినహాయింపుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందరూ ఊహించినంత కాకుండా కొంతమేరనే ఊరట కలిగించారు.

ప్రధానంగా రాష్ట్ర విభజన అనంతరం... ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పిన అనంతరం వచ్చిన ఈ బడ్జెట్ పైన ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు కేంద్రం వరం ఇచ్చింది. దాంతో పాటు ఎన్నో ప్రయోజనాలు కల్పించింది. అయితే, విశాఖకు రైల్వే జోన్ వంటి పలు అంశాలపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి.

ఇప్పటికే ప్రత్యేక హోదాను బీజేపీ అటకెక్కించిందని, ఇలాంటి సమయంలో ప్యాకేజీతోనైనా ఊరట కలిగించేలా చేస్తుందనుకుంటే అది కూడ లేదని చెబుతున్నారు.

బడ్జెట్ అంతా జిమ్మిక్కు.. టిఎస్సార్

బడ్జెట్ అంతా జిమ్మిక్కు.. టిఎస్సార్

కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు టి సుబ్బిరామిరెడ్డి బడ్జెట్ పైన స్పందించారు. బడ్జెట్‌లో పేద ప్రజలకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. నిధులను ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వలేదని చెప్పారు. రైల్వే జోన్ అంశం కూడా లేదని చెప్పారు. బడ్జెట్‌లో ఏమీ లేదని అంతా జిమ్మిక్కు అన్నారు.

వెనుకబడిన ప్రాంతాలకు నిధుల్లోవు.. సిపిఎం

వెనుకబడిన ప్రాంతాలకు నిధుల్లోవు.. సిపిఎం

సిపిఎం నేత నర్సింగ రావు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు రూ.36,000 కోట్లు అవుతుందని, కానీ సరైన కేటాయింపులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయించలేదన్నారు. మొత్తానికి ఏపీకి ఒరిగిందేమీ లేదని చెప్పారు. ఈ బడ్జెట్ అంతా కార్పోరేట్ సెక్టారుకు అనుకూలంగా ఉందని సిపిఎం నేత లోకనాథమ్ అన్నారు.

హరిబాబు

హరిబాబు

అభివృద్ధి లక్ష్యంగా జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉందని బీజేపీ విశాఖ ఎంపీ హరిబాబు అన్నారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు గెయిన్ ట్యాక్స్ రద్దు చేయడం వారికి పెద్ద ఊరట అన్నారు.

హోదాపై ముందే చెప్పిన ఎకనామిక్ సర్వే

హోదాపై ముందే చెప్పిన ఎకనామిక్ సర్వే

ప్రత్యేక హోదా రాష్ట్రాల స్థితిగతులేమీ బాగాలేవని ఆర్థిక సర్వే వెల్లడించింది. బడ్జెట్‌కు ముందు ఆర్థికశాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2016-17 ఆర్థిక సర్వేలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని ఈ సందర్భంగా విశ్లేషించింది. తద్వారా ఏపీకి ప్రత్యేక హోదా పైనా తేల్చేసింది.

హోదా ఇచ్చినా..

హోదా ఇచ్చినా..

ఆర్‌ఆర్‌టీ పేర రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన మొత్తంలో 81% (దాదాపు రూ.26వేల కోట్లు) ప్రత్యేక హోదా ఉన్న సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌, మిజోరాం, నాగాలాండ్‌, మణిపూర్‌, మేఘాలయ, త్రిపుర, జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అసోంలకే వెళ్లాయని, అయితే వాటి పనితీరు మాత్రం దిగ్భ్రాంతికరంగా ఉన్నట్లు పేర్కొంది.

అభివృద్ధికి దూరమే..

అభివృద్ధికి దూరమే..

దశాబ్దాల తరబడి నిధులు పొందుతున్నా ప్రత్యేక హోదా రాష్ట్రాల పరిస్థితులను చూస్తే ఆర్‌ఆర్‌టీయే వీటిపాలిట శాపంగా పరిణమించిందా? అన్న అనుమానం కలుగుతుందని ఆర్థిక సర్వే అనుమానం వ్యక్తం చేసింది. కొన్నిదశాబ్దాలుగా ఆర్‌ఆర్‌టీ కింద ఈ రాష్ట్రాలకు నిధులు అందుతున్నప్పటికీ హిమాచల్‌, ఉత్తరాఖండ్‌లు మినహాయించి మిగతా అన్ని రాష్ట్రాలు తలసరి స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో అథమ స్థాయిలో ఉన్నాయని, ఎక్కువ నిధులు పొందుతున్న పేద రాష్ట్రాల నుంచీ ప్రగతిని సహజంగా ఎక్కువగా ఆశిస్తుంటామని అయితే దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపొయాయని, నాగాలాండ్‌, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో అయితే ఇది మరింత దారుణంగా ఉందని పేర్కొంది.

ఆ రాష్ట్రాల వలె..

ఆ రాష్ట్రాల వలె..

ఆయా రాష్ట్రాలు తమకున్న సహజ వనరులను సమృద్ధిగా నిర్వహించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించింది. తమకున్న సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటున్న రాష్ట్రాలు ప్రగతిపథం వైపు పయనిస్తున్నాయని తెలిపింది. ఇందుకు కొత్తగా ఏర్పడిన జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ప్రగతిని ఉదహరించింది. ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న ఈ రాష్ట్రాలు ప్రగతి సాధిస్తున్నాయని, ఆ రాష్ట్రాల్లో పేదరికం నిష్పత్తి రెండు దశాబ్దాల్లో 31 శాతానికి తగ్గిందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+