జగన్ ఇదే పని నాడు చేసి ఉంటే - ఓటమి తప్పేదా..!!
వైఎస్ జగన్ రాష్ట్రంలో అప్పుల మొదలు పాలసీ వ్యవహారాల పైన సుదీర్ఘంగా వివరించారు. అధికారంలో ఉన్న సమయంలో మీడియాతో మాట్లాడలేదు. ఇప్పుడు ఓటమి తరువాత వరుసగా జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో జగన్ పైన చంద్రబాబు అండ్ టీం చేసిన ఆరోపణలకు జగన్ స్పందించలేదు. కానీ, ఇప్పుడు అవన్నీ తప్పని ఆధారాలతో చెబుతున్నారు. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదే ఆ రోజే చేసి ఉంటే..ఓటమి పాలయ్యేవారా.
జగన్ వివరణతో
మాజీ సీఎం జగన్ అనేక కీలక అంశాల పైన స్పందించారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాలు చేసారనే ఆరోపణలకు ఇప్పుడు సమాధానం ఇచ్చారు. 13 లక్షల కోట్లు అప్పులంటూ ఎన్నికల వేళ జగన్ పైన ప్రచారం సాగింది. జగన్ ఏనాడు అప్పుల గురించి సమాధానం చెప్పలేదు. ఈ రోజు నోరు విప్పారు. బాబు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం అప్పు రూ.1,53,347 కోట్లు ఉండగా, ఆయన దిగిపోయే నాటికి అవి రూ.4,08,710 కోకు చేరాయి. ఇది 21.63 శాతం పెరుగుదల. అదే తన ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ,7,48,000 కోట్లు అప్పు ఉందని జగన్ వెల్లడించారు. ఇది 12.90 శాతం మాత్రమే పెరుగుదలగా పేర్కొన్నారు.

మద్యం బ్రాండ్లు చంద్రబాబువే
రూ.5,655 కోట్లు కేంద్రం నుంచి జూన్ 10న వచ్చాయి. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో.. అంటే జూన్ 12 నాటికి రాష్ట్ర ఖజానాలో దాదాపు రూ.7 వేల కోట్లు ఉన్నాయి. పోలవరం గురించి వివరించారు. చంద్రబాబు చేసిన తప్పిదాలను సాంకేతిక అంశాలతో విశ్లేషించారు. జగన్ పోలవరం పూర్తి చేయలేదనే విమర్శలకు జగన్ నాడు సమాధానం చెప్పలేదు. ఇసుక విధానం గురించి వివరించారు. మద్యం విక్రయాలు..ధరలు...వాస్తవాలను చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలోనే కొత్త బ్రాండ్లు వచ్చాయని.. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కొత్తగా, ఏ డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు. మద్యం బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదుని జగన్ వెల్లడించారు.
నాడు మౌనం తో మునిగిన జగన్
ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలక్స్.. ఈ రెండు బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు. 2017 నవంబరు 22న అనుమతి ఇచ్చారని జగన్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో జగన్ పైన మద్యం అమ్మకాలు, బ్రాండ్ల గురించి పెద్ద ఎత్తున చంద్రబాబు..పవన్ ఆరోపణలు చేసారు. ఈ అంశంగా జగన్ పైన వ్యతిరేకతకు కారణంగా నిలిచింది. అలాంటి అంశంలోనూ ఈ రోజు చెప్పిన వాస్తవాలను నాడు జగన్ చెప్పలేదు. ఈ ప్రచార ఫలితం జగన్ ఓటమి పాలయ్యారు. నాడు ఎన్నికల ప్రచార సమయంలోనూ ఈ అంశాలను బయట పెడితే ఓటమితే తప్పదేమో అనే చర్చ వైసీపీ కేడర్ లో మొదలైంది.












Click it and Unblock the Notifications