మూడు దశాబ్దాల తర్వాత ఓకే వేదిక పైకి తోడల్లుళ్ళు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటు చేసుకోబోతుంది. సినీ నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం ఎన్టీఆర్ అల్లుళ్ళు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వేంకటేశ్వర రావు.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి రాబోతున్నారు. దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 6న విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ఆ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రచురించారు. ఈ క్రమంలోనే దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఇటీవలే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానించారు. ఎంపీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి పుస్తకావిష్కరణ సభను నిర్వహించనున్నారు. తెలుగు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆంగ్ల పుస్తకాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించనున్నారు.

1995లో చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీని వీడిపోయారు. ఆయన తన భార్య పురందేశ్వరి సహా ఇతర పార్టీల్లో కొనసాగారు. గతంలో పలుమార్లు చంద్రబాబుపై దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు సైతం చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. చంద్రబాబు, దగ్గుబాటి కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా ఇద్దరూ ఒకే బహిరంగ వేదిక పైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం చర్చనీయాంశం అవుతోంది.
1995లో చివరిసారి వీరు కలిసి ఒక వేదికపై కనిపించారు. ఆ తర్వాత రాజకీయ విభేదాల కారణంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. అప్పటి నుంచి వీరి మధ్య బహిరంగంగా ఎలాంటి సమావేశం జరగలేదు. ఈ నెల 6న విశాఖపట్నంలో జరగబోయే ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొనబోతుండడం ఏపీ రాజకీయాల్లో హాట్ డిస్కషన్ కి తెరలేపింది. ఇది కేవలం ఒక సామాజిక కార్యక్రమమేనా, లేదా దీని వెనుక కొత్త రాజకీయ సమీకరణాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమావేశం వల్ల భవిష్యత్తులో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయో లేదో అని చూడాలి.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications