AP Secretariat : అమల్లోకి జగన్ ఆదేశాలు-సచివాలయంలో సీఎస్ ఆకస్మిక తనిఖీలు.. !
ఏపీ సచివాలయంలో ఉద్యోగులు పనివేళల్లో అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై పని వేళల్లో ఉద్యోగులు తమ సెక్షన్లలోనే ఉండాలని ఆదేశించింది. దీనిపై సీఎస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని కూడా తెలిపింది. అన్నట్లుగానే ఇవాళ సీఎస్ తనిఖీలకు దిగారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇవాళ సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సాధారణ పరిపాలన శాఖ గతంలో ఇచ్చిన సర్కులర్ ప్రకారం ఆయన ఇవాళ ఈ తనిఖీలు నిర్వహించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ విధుల్లో ఉన్నారా లేదా అనేది సీఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. సచివాలయంలోని వివిధ బ్లాక్ లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ అందుబాటులో ఉన్న అధికారులతో వివరాలు తీసుకున్నారు. దీని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

సచివాలయంలోని మూడవ బ్లాకు వద్ద ఉద్యోగులు ఎవరెవరు ఉన్నారు, సమయానికి వస్తున్నారా లేదా అని సీఎస్ జవహర్ రెడ్డి ఆరా తీశారు. మహిళాశిశుసంక్షేమ, మైనార్టీ వెల్ఫేర్, పర్యటక శాఖల్లో ఉద్యోగుల పని సమయాన్ని సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ఎంత అటెండెన్స్ వుంది ఎంతమంది వచ్చారు అనే వివరాలు కూడా సీఎస్ సేకరించారు. ఉద్యోగుల సీట్ల వద్దకు వెళ్లి మరీ సీఎస్ తనిఖీలు నిర్వహించారు. ఇవాళ సచివాలయానికి వస్తూనే ఆయన మూడవ బ్లాక్ కు వెళ్లి ఈ తనిఖీలు చేపట్టడంతో ఉద్యోగులు ఈ తనిఖీలపై చర్చించుకుంటున్నారు.

-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..












Click it and Unblock the Notifications