అది అందరికీ తెలుసు, జగన్‌పై మళ్లీ తీవ్రవ్యాఖ్య: కొత్తపల్లి గీత మరో పార్టీవైపు చూస్తున్నారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అరకు ఎంపీ కొత్తపల్లి గీత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చదవండి: వైసిపికి షాక్, అంతా స్టంట్: జగన్ పాదయాత్రపై కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు

ఈ మేరకు ప్రముఖ తెలుగు టీవీ ఛానల్‌తో మాట్లాడినట్లుగా ఆ ఛానల్ వెల్లడించింది. జగన్ పాదయాత్ర పైన మళ్లీ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది.

జగన్ పైన సంచలనం

జగన్ పైన సంచలనం

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, ప్రత్యేక హోదా కోసం వైసిపి ఎంపీలు రాజీనామా చేసినప్పుడు తాను స్పందిస్తానని కొత్తపల్లి గీత పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా అన్నది ప్రజలను మభ్య పెట్టడానికే జగన్ చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ విషయం అందరికీ తెలుసు

ఆ విషయం అందరికీ తెలుసు

ప్రత్యేక హోదా నెరవేరదని అందరికీ తెలిసిన విషయమేనని కొత్తపల్లి గీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం జగన్‌కు కూడా తెలుసునని అభిప్రాయపడ్డారు.

మోడీకి చెబుతాం

మోడీకి చెబుతాం

ప్రత్యేక రైల్వే జోన్ కోసం పోరాడుతున్నామని, తప్పకుండా వస్తుందని కొత్తపల్లి గీత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతకుముందు రైల్వే మంత్రి సురేష్ ప్రభు వస్తుందని హామీ ఇచ్చారని, ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నామని చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని మోడీకి, కేంద్ర రైల్వే శాఖ మంత్రికి రిప్రజెంట్ చేస్తామన్నారు.

అలా చేస్తే సీఎం అవుతారా

అలా చేస్తే సీఎం అవుతారా

పాదయాత్ర చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి అవుతారా అని గీత ఇదివరకే అన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర ఓ పొలిటికల్ స్టంట్ అన్నారు. పాదయాత్ర చేసినంత మాత్రాన సీఎం కాలేరన్నారు. ఇప్పటికైనా అందరూ కళ్లు తెరవాలన్నారు. పాదయాత్ర మరో పొలిటికల్, హోదా స్టంట్ అన్నారు.

జగన్‌కు దూరమవుతున్నారా?

జగన్‌కు దూరమవుతున్నారా?

కాగా, కొత్తపల్లి గీత వ్యాఖ్యలు వైసిపిలో చర్చనీయాంశంగా మారాయి. ఆమె పార్టీకి దూరమవుతున్నారా అనే చర్చ సాగుతోంది. అయితే, ఇటీవల చంద్రబాబుపై ఆమె విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కొత్తపల్లి గీత కొత్తగా మరో పార్టీ వైపు చూస్తున్నారా అనే చర్చ సాగుతోంది.

జనసేన వైపు చూస్తున్నారా?

జనసేన వైపు చూస్తున్నారా?

కొత్తపల్లి గీత జనసేన వైపు చూస్తున్నారా అనే చర్చ కూడా గుతోంది. త్వరలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అటు వైపు చూస్తున్నారా అనే చర్చ సాగుతోంది. అయితే, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఆమె చెబుతున్నారు. అదే పవన్ కళ్యాణ్ హోదా కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన వైపు చూసే అవకాశాలు తక్కువే అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Araku MP MP Kothapalli Geetha make shocking comments on padatra, before YSRCP chief YS Jaganmohan Reddy's padayatra.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి