సమ్మె విరమణ ఒప్పందం ఇలా - కొత్తగా అంగీకరించినవి ఇవే : అమలు అప్పటి నుంచే..!!

ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రుల కమిటీ.. ఉద్యోగ సంఘాల నేతల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. ఉద్యోగ సంఘాల నేతలు తమ సమ్మె నోటీసును ఉప సంహరించుకున్నాయి. సుదీర్ఘంగా జరిగిన చర్చల ఫలితంగా స్టీరింగ్ కమిటీ నేతలు కొంత వెనక్కు తగ్గగా.. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ల పైన సానుకూలంగా స్పందించింది. రెండు వైపుల నుంచి ఒప్పంద అంశాల పైన మంత్రులు..స్టీరింగ్ కమిటీ నేతలు సంత కాలు చేసారు. సమావేశం మినిట్స్ ప్రకారం.. ప్రత్యేక జీవో ద్వారా త్వరలో పీఆర్సీ నివేదిక విడుదల.. గతంలో ప్రకటించిన విధంగా ఫిట్‌మెంట్‌ 23 శాతం కొనసాగింపుగా నిర్ణయించారు.

హెచ్ఆర్ఏ పైనే ప్రధాన చర్చ

హెచ్ఆర్ఏ పైనే ప్రధాన చర్చ

50 వేల లోపు జనాభా ఉంటే రూ.11 వేల సీలింగ్‌తో 10 శాతం హెచ్‌ఆర్‌ఏ కు అంగీకారం కుదిరింది. 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే రూ.13 వేల సీలింగ్‌తో 12 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉంటే రూ.17 వేల సీలింగ్‌తో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లించేలా ఒప్పందం పైన సంతకాలు చేసారు. 13 జిల్లా కేంద్రాలకు ఇదే స్లాబు వర్తిస్తుంది. ఆదివారం సీఎంను కలిసి ధన్యవాదాలు తెలుపుతామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. సీఎం జగన్ సూచనల మేరకు మంత్రివర్గ ఉప సంఘం రెండు రోజులపాటు విస్తృతంగా చర్చలు జరిపింది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుది విడత చర్చలు జరిపారు.

సీఎంకు ఎప్పటికప్పుడు సమాచారం

సీఎంకు ఎప్పటికప్పుడు సమాచారం

చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు టెలిఫోన్‌లో సీఎంకు వివరిస్తూ ఆయన సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు పూర్తయ్యాక మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎంకు ఫోన్‌లో వివరించగా ఆయన ఆమోదించారు. అందులో భాగంగా.. రిటైర్డ్‌ ఉద్యోగుల అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ 70-74 ఏళ్ల వారికి 7 శాతం, 75-79 ఏళ్ల వారికి 12 శాతం చెల్లించేలా నిర్ణయం జరిగింది. 2022 జనవరి నుంచి గ్రాట్యుటీ అమలు.. మధ్యంతర భృతి రికవరీ ఉపసంహరణ కు అంగీకారం కుదిరింది. వేతన సవరణ పరిమితి ఐదేళ్లే.. అంత్యక్రియల ఖర్చు రూ.25 వేలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో.. పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపుకు అంగీకారం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల కు నిర్ణయం తీసుకున్నారు.

సీపీఎస్ పైన రూట్ మ్యాప్

సీపీఎస్ పైన రూట్ మ్యాప్

సీపీఎస్‌ను పరిశీలించేందుకు కమిటీ ఏర్పా టు.. 2022 మార్చి 31 నాటికి రోడ్‌ మ్యాప్‌ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు.. ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగుల అంశంపై ఇందులోనే పరిశీలన ఉంటుందని స్పష్టం చేసింది. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఎక్స్‌టెన్షన్‌కు సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ స్కీమ్‌ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని హామీ దక్కింది. ఇక, 2022 జూన్‌ 30లోపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు చేసి.. అప్పటి నుంచి స్కేల్స్‌ వర్తింపు అమలు చేస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన చేసారు.

చర్చల ఒప్పందాలు... ప్రభుత్వ హామీలు

చర్చల ఒప్పందాలు... ప్రభుత్వ హామీలు

ఉద్యోగులు ఆశించిన మేర పీఆర్సీ లేకపోవడం వల్ల వారిలో ఉన్న ఆవేదన, అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పుకొచ్చారు. కోవిడ్‌ పరిస్థితులు దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకోలేని విధంగా దెబ్బతిందన్నారు. అందుకే అనుకున్న మేరకు, ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ ఇవ్వలేకపోయారని చెప్పారు. వారికి ఇంకా మేలు చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి నెలకొందని వివరించారు. ఎంత వరకు చేయాలో అంతవరకు పీఆర్సీ ఇచ్చారన్నారు. ఆందోళనల సందర్భంగా కొందరు ఉద్యోగులు ఇబ్బందికరంగా మాట్లాడినా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించిందని చెప్పారు. త్వరగా సమస్య పరిష్కారం అవడానికి చర్చలే దోహదం చేశాయని సజ్జల పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+