కూలీ దంపతులను ముంచిన అగ్రిగోల్డ్: నదిలో దూకి ఆత్మహత్య
విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అగ్రిగోల్డ్ బాధిత జంట ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ భవానీపురంలో నివాసం ఉంటున్న ఓ వృద్ధ దంపతులు అగ్రిగోల్డ్ బాధితులు. వారు కూలీ పని చేసుకొని బతుకుతుంటారు.
భవిష్యత్తు కోసం అగ్రిగోల్డ్‌ను నమ్ముకున్నారు. అయితే, అది పూర్తిగా ముంచడంతో.. ఏం చేయాలో తెలియక కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
గుంతకుల్లులో ఆత్మహత్యాయత్నం
గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పెన్షన్లు, ఇంటి పట్టాలు రద్దు చేశారనే కారణంతో మనస్తాపం చెందిన వారు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

భూ సేకరణకు వ్యతిరేకంగా ధర్నా
రాజధాని నిర్మాణ గ్రామాల్లో బలవంతపు భూసేకరణ వ్యతిరేకిస్తూ గ్రామ కంఠాలను విస్తరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంగళగిరి మండలం నిడమర్రు, నవులూరు గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాల ఎదుట వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు ఆధ్వర్యాన రైతులు ధర్నా నిర్వహించారు.
వైసిపి, కాంగ్రెస్, సిపిఎం.. తదితర పార్టీల ఆధ్వర్యంలో నిడమర్రు సిఆర్డిఏ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కొలనుకొండ శివాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మల్లాది విష్ణు మాట్లాడుతూ... సింగపూర్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపూరితంగా బహుళ పంటలు పండే భూములను తీసుకుని రైతులకు, రైతుకూలీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. స్వచ్చందంగా భూములిచ్చే వారినుంచి తీసుకోవచ్చని, ఇష్టంలేని రైతుల నుంచి సేకరణ చేయవద్దన్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications