షోకాజ్‌పై జెసి డోంట్ కేర్!: ఆయన తప్ప అని నారాయణ

సోనియాను విమర్శించిన జెసి పైన చర్యలు తీసుకోవాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఏఐసిసికి లేఖ రాయగా, ఆయనకు షోకాజ్ నోటీసులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ రెండు రోజుల క్రితం చెప్పారు.
అయితే, జెసికి మాత్రం ఇప్పటి వరకు షోకాజ్ నోటీసులు అందలేదు. తనకు నోటీసులు అందలేదని, ఆ నోటీసులను తాను పెద్ద విషయంగా భావించడం లేదన్నారట.
జెసి తప్ప ఎవరు అనలేదు: నారాయణ
తెలంగాణను అడ్డుకోవడం కోసమే రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారని, నిజానికి ఆ రాష్ట్రాన్ని ఎవరు కోరుకుంటున్నారు? జెసి దివాకర్ రెడ్డి తప్ప? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తాము స్థూలంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని కోరుతున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ బిల్లును ఓడిస్తామని పదేపదే ప్రగల్భాలు పలికేవారు తీరా బిల్లు వచ్చాక ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రాజకీయ అవగాహన ఉన్నవారెవరూ ఇలా ఓడిస్తామని మాట్లాడరని, పునర్ వ్యవస్థీకరణపై సభలో అభిప్రాయం చెప్పడమే కానీ, ఓటింగ్ ఉండదన్నారు.












Click it and Unblock the Notifications