ఏఐ బాటలో ఉగ్రవాదం: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఉగ్ర సంస్థల కొత్త ప్లాన్!

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కోలుకోలేని విధంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఆధారిత జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ, ఇప్పుడు ఉగ్ర నియామకాలను పెంచుకోవడానికి వినూత్నంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఆశ్రయించింది. తమ అధిపతి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ బతికే ఉన్నాడని, పూర్తి చురుగ్గా ఉన్నాడని చూపించేందుకు ఏఐ రూపొందించిన డీప్‌ఫేక్ ఆడియో, వీడియో క్లిప్‌లను సృష్టిస్తూ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.

ముగ్ధ మృతి వెనుక అసలు నిజాలేంటి? ఎవరికీ తెలియకుండా ఇండియాకి ఎందుకొచ్చింది?
ముగ్ధ మృతి వెనుక అసలు నిజాలేంటి? ఎవరికీ తెలియకుండా ఇండియాకి ఎందుకొచ్చింది?

భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గతం ఇస్లామిక్ స్టేట్, అల్-ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు మాత్రమే ఏఐ ఆధారిత ప్రచారాన్ని ఉపయోగించేవి. అయితే లష్కర్-ఎ-తైబా, జైష్-ఎ-మహమ్మద్ వంటి సంస్థలు ఇప్పటివరకు సంప్రదాయ పద్ధతులపైనే ఆధారపడ్డాయి. కానీ మసూద్ అజార్ అదృశ్యం కావడంతో నియామకాలు పూర్తిగా మందగించడంతో జైష్-ఎ-మహమ్మద్ ఇప్పుడు ఏఐ డీప్‌ఫేక్ మార్గాన్ని ఎంచుకుంది.

Terror Group Jaish-e-Mohammed Uses AI Deepfakes of Masood Azhar to Boost Recruitment after Operation Sindoor

ఆపరేషన్ సింధూర్ దెబ్బకు మూలాలు కదిలిన జైష్
పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిపిన దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద సంస్థలకు నరకం చూపించింది. పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లో ఉన్న జైష్-ఎ-మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని భారత సైన్యం ఈ ఆపరేషన్లో పూర్తిగా ధ్వంసం చేసింది. మసూద్ అజార్ అత్యంత సన్నిహిత బంధువులతో సహా ఆ సంస్థకు చెందిన పలువురు అగ్రశ్రేణి కమాండర్లు ఈ దాడుల్లో హతమయ్యారు. ఈ ఆపరేషన్ తర్వాత జైష్-ఎ-మహమ్మద్ తీవ్ర ఆర్థిక, నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. మసూద్ అజార్ బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన చనిపోయాడని లేదా తీవ్రంగా గాయపడి మంచాన పడ్డాడని భావించిన పాక్ యువత.. ఆ సంస్థలో చేరేందుకు ఆసక్తి చూపడం మానేశారు.

Flydubai: భారతీయ పైలట్ పై దాడి చేసిన కో పైలట్ కు ఉరిశిక్ష ?
Flydubai: భారతీయ పైలట్ పై దాడి చేసిన కో పైలట్ కు ఉరిశిక్ష ?

డీప్‌ఫేక్ వీడియోలతో భారత్‌పై జిహాద్‌కు పిలువు
క్షీణిస్తున్న కేడర్‌ను మళ్లీ యాక్టివ్ చేసేందుకు జైష్-ఎ-మహమ్మద్ టెక్నికల్ టీమ్స్ మసూద్ అజార్ పాత ఆడియోలు, వీడియోలను ఉపయోగించి అత్యంత సహజంగా కనిపించే ఏఐ డీప్‌ఫేక్ క్లిప్‌లను తయారు చేస్తున్నాయి. ఈ నకిలీ వీడియోల్లో మసూద్ అజార్ పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపిస్తూ.. సంస్థలో చేరి ఇండియాకు వ్యతిరేకంగా జిహాద్ చేయాలని ప్రజలను రెచ్చగొడుతున్నాడు. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఈ నకిలీ ప్రచారాన్ని పసిగట్టి, సరిహద్దు డిజిటల్ నెట్వర్కులపై నిఘాను భారీగా పెంచారు. సైబర్ స్పేస్ వేదికగా జరుగుతున్న ఈ కొత్త తరహా ఉగ్ర ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు భారత భద్రతా దళాలు సిద్ధమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+