అభిమాని ప్రేమకు గిల్ నో.. లేడీ ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్!
న్యూజిలాండ్ జట్టుతో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా ఐదు వన్డేల సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల పరంగా భారత్, న్యూజిలాండ్ రెండు జట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. శుభ్‌మన్ గిల్‌తో ఫోటో దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళా అభిమానికి చేదు అనుభవం ఎదురవ్వడంతో ఆమె తన బాధను వ్యక్తం చేసిన వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఈ వ్యవహారంలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. సదరు మహిళా అభిమాని గతంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా శుభ్‌మన్ గిల్ కోసం స్టేడియంలో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌తో తీవ్రంగా వాదించిన వ్యక్తి కావడమే. ఆ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేసిన తర్వాత అబ్రార్ అహ్మద్ ఆవేశంగా సెండాఫ్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ లేడీ ఫ్యాన్ శుభ్‌మన్ గిల్‌కు సపోర్టుగా అబ్రార్ అహ్మద్‌తో ఘర్షణకు దిగింది. ఆ సమయంలో ఆ లేడీ అభిమాని సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే వైరల్ అయ్యారు.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మహిళా అభిమాని తన నిరాశను, ఆవేదనను వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ పర్యటనలో శుభ్‌మన్ గిల్ వద్దకు వెళ్లి.. "శుభ్‌మన్ భాయ్.. మీతో ఒక ఫోటో కావాలి" అని కోరగా.. గిల్ నిరాకరిస్తూ కేవలం సారీ అని చెప్పి వెళ్లిపోయారని వెల్లడించారు. గతంలో గిల్ కోసం పాకిస్తాన్ బౌలర్‌తో కూడా గొడవపడిన తనకు ఆయన ఇలాంటి సమాధానం ఇవ్వడం ఎంతో బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటన ఏ పరిస్థితుల్లో జరిగింది, గిల్ ఫోటోకు ఎందుకు నిరాకరించాల్సి వచ్చిందనే దానిపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు.














Click it and Unblock the Notifications
