ర్యాపిడోలో బంగారం పంపించిన యజమాని.. బంగారు నగలతో ర్యాపిడో బాయ్ జంప్..!

నేటి బిజీ లైఫ్ లో ర్యాపిడో బైక్, ఆటో సేవలు ఎంతగా పాపులర్ అయ్యాయో మనకు తెలిసిందే. హైదరాబాద్ నగరంలో నిత్యం వేల మంది ర్యాపిడో సేవలను వినియోగించుకుంటారు. నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే గతంలో ఆటో, బస్సుల్లో వెళ్లేవారు. అయితే ఇప్పుడు దర్జాగా ఇంట్లో కూర్చొనే ర్యాపిడో, ఊబర్ లను బుక్ చేసుకుని గమ్య స్థానాన్ని చేరుకుంటున్నారు. అయితే ర్యాపిడోలో ఇటీవలి కాలంలో పార్సెల్ సర్వీస్ ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఓ వ్యక్తి ర్యాపిడో ద్వారా ఏదైనా వస్తువు, పదార్థం, ఇతర సామాగ్రిని నగరంలోని మరో వ్యక్తికి పంపించవచ్చు. ఈ పార్సిల్ డెలివరీ విధానం ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. నగరవాసులు ఈ విధానాన్ని అధికంగా వినియోగించుకుంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. ర్యాపిడోలో బైక్ పార్సిల్ బుక్ చేసి బంగారు ఆభరణాలను పంపించాలనుకున్న ఓ వ్యక్తికి ర్యాపిడో డ్రైవర్ నుంచి ఊహించని షాక్ తగిలింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివో మొబైల్ ఫోన్ సంస్థ మేనేజర్ దత్త ప్రసాద్ నల్లపాటి నాగోల్ లోని తన బంధువుల ఇంటికి రూ. 62,383 విలువైన బంగారు నగలను పార్సిల్ మాదిరి పంపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బంగారు ఉంగరాలు, గాజులను ప్యాక్ చేశారు. ర్యాపిడో పార్సిల్ సేవల కోసం బుకింగ్ చేశారు. బంగారం ఉన్న పార్సిల్‌ ను ర్యాపిడో డ్రైవర్‌ కు ఇవ్వాలని ఆఫీస్ లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. ఇక కార్యాలయానికి వచ్చిన ర్యాపిడో డ్రైవర్ గీతిమెట్టు మురళికి సెక్యూరిటీ గార్డు పార్సిల్ అందజేశాడు. అయితే నాగోల్ వరకు వెళ్లాలంటే అదనంగా పెట్రోల్ కు రూ. 100 ఇవ్వాలని ర్యాపిడో డ్రైవర్ తెలిపాడు. అయితే సెక్యూరిటీ గార్డు అదే విషయాన్ని దత్త ప్రసాద్ కు చేరవేయడంతో ఆయన రూ.100 ఫోన్ పే చేశారు. దాంతో అక్కడి నుంచి ర్యాపిడో డ్రైవర్ స్టార్ట్ అయ్యాడు.

Hyderabad Rapido driver fled with gold ornaments after being entrusted to deliver them shocking

అయితే కొద్దిసేపటి తర్వాత దత్త ప్రసాద్ ఫోన్ చేయగా ర్యాపిడో డ్రైవర్ లిఫ్ట్ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. ఈ క్రమంలో ర్యాపిడో డెలివరీ బాయ్ మోసానికి పాల్పడినట్లు గ్రహించిన దత్త ప్రసాద్.. తొలుత ర్యాపిడో కస్టమర్‌ కేర్‌ ను సంప్రదించారు. కానీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. దాంతో జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+