ఎయిర్ హోస్టెస్ మృతి: భర్తపై అనుమానం, ఆర్థికంగా బాగుందని చెప్పి!
హైదరాబాద్: మాజీ ఎయిర్ హోస్టెస్ రీతును ఆమె భర్తనే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాలే కారణం కావొచ్చునని పలువురు అనుమానిస్తున్నారు. ఆమె తలకు బలమైన గాయం అయినట్లుగా తెలుస్తోంది.

పోస్టుమార్టం తర్వాత వివరాలు తెలుస్తాయి
రీమా రాత్రి చనిపోయి పడి ఉందని, రాత్రి పూట ఆసుపత్రికి తీసుకు వెళ్లామని మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. రీతుది జంషెడ్ పూర్ అని, భర్తది పంజాబ్ అని చెప్పారు.
పెళ్లి అనంతరం హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారని చెప్పారు. ఈ సంఘటనలో ఉరేసుకున్న ఆనవాళ్లు లేవని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్థు చేస్తున్నామని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం వివరాలు తెలుస్తాయని చెప్పారు.
ఆర్థికంగా బాగున్నానని చెప్పి...!
రీతు కొద్ది రోజుల క్రితం వరకు ఎయిర్ హోస్టెస్‌గా పని చేశారు. రీతు, భర్త సచిన్‌లు ప్రేమించుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చి పెళ్లి చేసుకున్నారు. అనంతరం రీతూ ఉద్యోగం మానేశారు.
అయితే, పెళ్లికి ముందు తనకు వ్యాపారాలు ఉన్నాయని, ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నానని చెప్పి అతను రీమాను నమ్మించి పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ, తీరా హైదరాబాద్ వచ్చాక అసలు అతని వద్ద ఏమీ లేవని తెలిసినట్లుగా సమాచారం. దీనిపై వాగ్వాదం జరిగేదని తెలుస్తోంది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications