శుభవార్త: విజయవాడ నుండి అంతర్జాతీయ విమానాలు, ఏడాదిలో అంతర్జాతీయ టెర్మినల్ పూర్తి
అంతర్జాతీయ హోదాను అందిపుచ్చుకోవడంతో విజయవాడ విమానాశ్రయం నుండి ప్రపంచ దేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు విమానయానసంస్థలు ముందుకు వస్తున్నాయి.
విజయవాడ:అంతర్జాతీయ హోదాను అందిపుచ్చుకోవడంతో విజయవాడ విమానాశ్రయం నుండి ప్రపంచ దేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు విమానయానసంస్థలు ముందుకు వస్తున్నాయి.
విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా దక్కింది. దీంతో అమరావతి రాజధానికి అంతర్జాతీయ విమానసర్వీసులను నడిపేందుకుగాను ఎయిరిండియా నుండి స్పష్టమైన హామీ వచ్చింది. ఆసియా దేశాలకు నడిపేందుకు ఎయిర్ ఏషియా సంస్థ సుముఖత వ్యక్తం చేసింది.
దేశీయ దిగ్గజ ప్రైవేట్ విమానాయాన సంస్థ ఇండిగో సానుకూలంగా ఉంది. అధికారికంగా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.అయితే కోస్తా జిల్లాల నుండి లక్షలాది సంఖ్యలో ఎన్ ఆర్ ఐ లు ఉన్నందున అంతర్జాతీయ విమానాలు నడపడం కలిసివచ్చే అంశంగా భావిస్తున్నాయి విమానాయనసంస్థలు
కృష్ణా జిల్లాలో ప్రతి వంద ఇళ్ళకు ఒక ఎన్ ఆర్ ఐ ఉన్నట్టు అంచనాలున్నాయి. విదేశీ విద్య, ప్రాజెక్టు వర్క్స్ , ఉద్యోగాలు , ఉపాధి పొందటం వ్యాపార లావాదేవీలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడం వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.

అంతర్జాతీయ విమానసర్వీసులతో ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి ప్రతి ఏటా విదేశాలకు వెళ్తుంటారు. ఈ జిల్లాల పరిధిలోనే సుమారు ఆరు లక్షల మంది ఎన్ ఆర్ ఐ లు ఉన్నారని అంచనా. పర్యాటక స్థలాల సందర్శన కోసం కోస్తా జిల్లాల నుండి ప్రతి ఏటా భారీ సంఖ్యలో విదేశాలకు వెళ్తుంటారు. సింగపూర్, మలేషియా, థాయ్ లాండ్, హాంకాంగ్, శ్రీలంక, అమెరికా , యూరప్ , దుబాయ్ ,కువైట్, అస్ట్రేలియా వెళ్ళేవారు ఎక్కువగా ఉన్నారు.దీంతో అంతర్జాతీయ విమానసర్వీసులకు విజయవాడకు నడపడం ప్రయోజనమని భావిస్తున్నాయి విమానాయన సంస్థలు.

ఆఫ్రికా దేశాలకు వెళ్ళేవారు కూడ ఎక్కువే
ఈ ప్రాంతం నుండి విదేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు. ఆఫ్రికా దేశాలకు వెళ్ళేవారి సంఖ్య కూడ తక్కువేమీకాదు. ఆఫ్రికా ఖండానికి చెందిన దేశాల్లో సహజవనరులు అపారంగా ఉంటాయి. ఈ రెండు జిల్లాల నుండి ఎక్కువగా ఖనిజవనరుల వెలికితీతకోసం లీజులు పొందిన వారు కూడ ఎక్కువగానే ఉన్నారు. ఆసియాదేశాల్లోని పలు ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్ళేవారి సంఖ్య కూడ తక్కువేమీకాదు.

విదేశీయుల రాకపోకలు కూడ ఎక్కువే
విదేశాల నుండి రాకపోకలు సాగించే విదేశీయుల సంఖ్య కూడ ఎక్కువే. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. జపాన్, సింగపూర్, మలేషియా, నార్వే, న్యూజిలాండ్, ఇటలీ, అమెరికా, చైనా, రష్యా, ఆఫ్రికా తదితర దేశాల నుండి వ్యాపార బృందాలు, పారిశ్రామిక బృందాలు తరలివస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాజధాని విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది.అమరావతిలో పెట్టుబడులుపెట్టేందుకుగాను విదేశీ బృందాలు ఎక్కువగా వస్తున్నాయి.

ఎయిర్ పోర్ట్ లో మెరుగైన వసతుల కల్పన
ఆంధ్రప్రదేశ్ కు నేరుగా విదేశీయులు రాలేని పరిస్థితి ఉండేది. హైద్రాబాద్ కు చేరుకొని అక్కడి నుండి ప్రత్యేక బస్సులు, కార్లలో రావాల్సి వస్తోంది. హైద్రాబాద్ లోనే విదేశీయులకు అతిథ్యాన్ని ఇచ్చేవారు. విజయవాడలో ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మాణదశలో ఉన్నాయి.ఇరవై వరకు త్రీస్టార్, బడ్జెట్ హోటల్స్ ఏర్పాటు జరిగాయి. విజయవాడ ఎయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ స్థాయి హోదా రావడం శుభపరిణామంగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ హోదా అందిపుచ్చుకొనేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం లేకపోలేదు. ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ కూడ పూర్తి కావాల్సి ఉంది. రూ.516 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ ప్రతిపాదనలు సిద్దం చేశారు.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications