జియోకు పోటీగా ఎయిర్ టెల్ కొత్త ప్లాన్.. 199కే బ్రాడ్ బ్యాండ్
చౌక ధరలో రెండు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది. బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్ బై ప్లాన్ల పేరుతో వీటిని మార్కెట్ లోకి తెచ్చింది. ఒక ప్లాన్ ధరను రూ.199కి, మరో ప్లాన్ ధరను రూ.399కి అందిస్తోంది. బ్యాకప్ ప్లాన్ పేరిట ₹198కే జియో మార్చిలో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీనికి పోటీగా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్లను తీసుకొచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో 10 ఎంబీపీఎస్ వేగం లభిస్తుంది. రౌటర్ ఉచితంగా అందిస్తారు. రూ.199 ప్లాన్ కింద 5 నెలల చందాను ఒకేసారి చెల్లించడంతోపాటు ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు రూ.500 కలుపుకొని రూ.1674 ఒకేసారి చెల్లించాలి. రూ.399 ప్లాన్‌లో కూడా 10 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. దీనిక్కూడా రౌటర్ ఉచితంగానే అందిస్తారు. వీటితో పాటు అదనంగా ఎక్స్‌ట్రీమ్ బాక్స్, 350 ఛానెళ్లు ఉచితంగా లభిస్తాయి. ఇన్‌స్టాలేషన్ ఛార్జీ, 5 నెలల ప్లాన్ ధరతో కలుపుకొని రూ.3వేలు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు కాకుండా రూ.499, రూ.799, రూ.999, రూ.1498, రూ.3999 ధరల్లో కూడా ఎయిర్ టెల్ వివిధ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తోంది.

రిలయన్స్ జియో గత నెల రూ.198కే బ్యాకప్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద యూజర్లు 10 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు పొందుతారు. ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లు అదనంగా ₹21 నుంచి ₹152 చెల్లించి ఒక రోజు నుంచి ఏడు రోజుల పాటు తమ ఇంటర్నెట్ వేగాన్ని 30 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు పెంచుకోవడానికి అవకాశం ఉంది. 5 నెలల చందా ఒకేసారి చెల్లించడంతోపాటు ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా టీవీ, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందొచ్చు.












Click it and Unblock the Notifications