ఎయిర్ టెల్ డేటా ప్లాన్ రీఛార్జి చేసుకున్నారా?
ఎయిర్‌టెల్ ఇటీవల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని భారీగా పెంచింది. దీంతో ఆ కంపెనీకి సంబంధించి కొత్త ప్లాన్స్ అమలులోకి వచ్చాయి. గతంలో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇప్పుడు ఇవ్వడంలేదు. ఎయిర్‌టెల్ వినియోగదారులందరూ కొత్త ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 1.5జీబీ డేటా లభించే ప్లాన్ రీఛార్జ్ చేసినట్టైతే గడువు ముగిసిన తర్వాత కింద వివరించిన ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజూ 1.5జీబీ డేటా కావాలనుకుంటే ఈ ప్లాన్స్ ఎంచుకోవచ్చు.
Airtel 299 Plan: ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే వేలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్ తోపాటు రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. రూ.249 ప్లాన్ ను రూ.299కి పెంచారు.
Airtel 479 Plan: ఎయిర్‌టెల్ రూ.479 ప్లాన్ రీఛార్జ్ చేస్తే వేలిడిటీ 56 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్ తోపాటు రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది.రూ.399 ప్లాన్‌ను రూ.479కి పెంచారు.

Airtel 719 Plan: రూ.719 రీఛార్జ్ చేస్తే వేలిడిటీ 84 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్ తోపాటు రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది. రూ.598 ప్లాన్‌ను రూ.719కి పెంచారు.
రూ.299, రూ.479, రూ.719 ప్లాన్స్‌పై ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్ యాక్సెస్ ఇస్తున్నారు. దీంతో పాటు అపోలో 24/7 సర్కిల్ మూడు నెలల యాక్సెస్, షా అకాడమీలో ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచితంగా హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఫ్రీ యాక్సెస్ లభిస్తాయి.












Click it and Unblock the Notifications