హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఫ్రీ వైఫై: నేటి నుంచి అందుబాటులోకి..
హైదరాబాద్ : నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో నేటి నుంచి ఫ్రీ వైఫై సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ఈ ఉచిత వైఫైని అందజేస్తోంది. టీఎస్ఆర్టీసీ-భారతి ఎయిర్ టెల్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నేటి నుంచి సిటీ బస్సుల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
నగరంలో ఎక్కువ రద్దీగా ఉండే మార్గాల్లో ప్రయాణించే 115 మెట్రో లగ్జరీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా 6 నెలల పాటు ఫ్రీ వైఫై సర్వీసును అందించనున్నారు. ఫ్రీ వైఫై ద్వారా బస్సులో ప్రయాణించేవారు ఎవరైనా సరే.. రోజుకు 20నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలను వినియోగించుకోవచ్చు.

ఈ ఉచిత వైఫై సేవలను ఎయిర్ టెల్ అందిస్తున్నప్పటికీ.. ఇతర టెలికాం వినియోగదారులు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు.












Click it and Unblock the Notifications