బాబుకు 'బ్రాండ్' షాక్: విసుగెత్తి తప్పుకుంటున్న అజయ్ దేవగణ్?
విజయవాడ: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఆంధ్రప్రదేశ్ అంబాసిడర్‌గా తప్పుకోనున్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం తీరు పైన అజయ్ దేవగణ్ సంతృప్తిగా లేరని, అందుకే తప్పుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు.
అజయ్ దేవగణ్, తన భార్య కాజోల్‌లో కలిసి ఏపీ పర్యాటక శాకకు అంబాసిడర్లుగా నియమితులైన విషయం తెలిసిందే. కానీ, ఇంత వరకు అడ్వర్టయిజ్‌మెంట్ నిమిత్తం ఒక్క యాడ్ ఫిల్మ్‌ను కూడా అజయ్ దేవగణ్‌తో చిత్రీకరించలేదు.

అజయ్ దేవగణ్‌కు ఏదో ఒక కార్యక్రమంలో ఏపీలో గల పర్యాటక ప్రాంతాల గురించి వివరించిన సందర్భాలు లేవని అంటున్నారు. కేవలం ప్రకటనకే పరిమితం కావడంపై అజయ్ దేవగణ్ అప్ సెట్ అయ్యారని అంటున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం తాను ఎలాంటి డబ్బులు తీసుకోకపోయినా టాప్ ఏజెన్సీల ద్వారా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అజయ్ దేవగణ్ భావించారని, ఇందుకోసం అజయ్ - కాజోల్‌లు లింటాస్, ఒజిల్వీ వంటి సంస్థలను కూడా చూపించారని చెబుతున్నారు.
అమరావతిలో 'రియల్' బిజినెస్: 'రామకృష్ణ'కు మహేష్ అంబాసిడర్కానీ, ఏపీ అధికారులు మాత్రం స్థానిక ఏజెన్సీతో పట్టాలెక్కించాలని భావిస్తోంది. అజయ్ దేవగణ్ చెప్పిన ప్రముఖ యాడ్ సంస్థల సూచనను పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు. స్థానిక పీఆర్ ఎజెన్సీల ద్వారానే ముందుకెళ్లలని ప్రభుత్వం భావించడంతో అజయ్ దేవగణ్ దంపతులు అప్ సెట్ అయ్యారని వార్తలొస్తున్నాయి.












Click it and Unblock the Notifications