Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజకీయాల్లోకి నో, అందుకే పుస్తకం, పదవిలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదంటే: అజేయ కళ్ళం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ అజేయ కళ్లం 'మేలు కొలుపు' పుస్తకావిష్కరణ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇలా అన్ని పార్టీలలోను రాచరిక వ్యవస్థ ఉందన్నారు. అన్ని పార్టీలు ఇలాగే ఉన్నాయన్నారు.

ప్రజాస్వామ్యం దశలవారీగా క్షీణిస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. యువతను చైతన్యం చేసేందుకే తాను మేలు కొలుపు పుస్తకం రాశానని చెప్పారు. వ్యవస్థలోని లోపాలను అందరికీ చెప్పాలనే ఈ పుస్తకం తీసుకు వచ్చినట్లు తెలిపారు.

Ajeya Kallam Melu Kolupu book released

రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి తనకు లేదని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయన్నారు.

పదవిలో ఉన్నప్పుడు ఇవి అన్నీ ఎందుకు చెప్పలేదని కొందరు అడుగుతున్నారని, కానీ పదవిలో ఉన్నప్పుడు ఇలాంటివి మాట్లాడవద్దనే ఊరుకున్నానని చెప్పారు. జస్టిస్ లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ.. సమాజాన్ని అవినీతి పట్టిపీడిస్తోందన్నారు. రక్షణ ఇవ్వాల్సిన వాళ్లే అవినీతికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులే అవినీతికి పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+