యూపీ వదిలేసి.., జగన్! జవాబివ్వు: సైకిల్ నేనే నడపగలనని బాబుపై అఖిలేష్

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేక హోదా షరతును పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబుకు, ప్రతిపక్ష నేత జగన్‌కు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సూచించారు. గుంటూరు జిల్లాలో ప్రత్యేక హోదా భరోసా సభలో మాట్లాడారు.

గుంటూరు: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేక హోదా షరతును పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబుకు, ప్రతిపక్ష నేత జగన్‌కు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సూచించారు. గుంటూరు జిల్లాలో ప్రత్యేక హోదా భరోసా సభలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రా రావాలనిపిస్తోంది..

ఆంధ్రా రావాలనిపిస్తోంది..

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే తాను ఇక్కడకు వచ్చానని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే యూపీ వదిలి ఇక్కడకు రావాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తాను ఏపీకి రావడం ఇదే మొదటిసారి అన్నారు. మీ ప్రేమ చూస్తుంటే ఆనందం వేస్తోందన్నారు. ఏపీకి ప్రధాని మోడీ ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ ఇవ్వాలన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతి ఎన్నికలను ఉపయోగించుకోవాలన్నారు. ఏపీ అభివృద్ది చెందాలనే మేం ఇక్కడకు వచ్చామన్నారు.

సైకిల్ మేమే నడపగలం

సైకిల్ మేమే నడపగలం

దేశంలో సైకిల్‌ను తాను, రాహుల్ గాంధీ మాత్రమే బాగా నడపగలమని అఖిలేష్ యాదవ్ అన్నారు. తద్వారా ఆయన చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు టిడిపి గుర్తు సైకిల్. అఖిలేష్ పార్టీ గుర్తు సైకిల్. కాబట్టి తాను, రాహుల్ మాత్రమే బాగా నడపగలమని, చంద్రబాబు బాగా నడపలేరని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చేందుకు ప్రత్యేక హోదా షరతు పెట్టాలని ఇటు చంద్రబాబుకు, అటు ప్రతిపక్ష నేత జగన్‌కు కూడా అఖిలేష్ సూచించారు.

టిడిపి నేతలు బాబును నిలదీయాలి, జగన్! జవాబివ్వు

టిడిపి నేతలు బాబును నిలదీయాలి, జగన్! జవాబివ్వు

ప్రత్యేక హోదా కోరితే తాము ప్రగతి నిరోధకులమా అని సురవరం ప్రశ్నించారు. హోదా అడిగితే కొందరు నల్ల జెండాలు చూపిస్తున్నారన్నారు. హోదా భావోద్వేగంతో కూడుకున్నది కాదని, ఈ రాష్ట్ర జీవన్మరణ సమస్య అన్నారు. ఇది ఆర్థిక సమస్య అన్నారు. ఎవరు హోదా కోసం సభ పెట్టినా చంద్రబాబు కాళ్లు వణుకుతున్నాయన్నారు. కేంద్రానికి ఎందుకు సాగిలపడ్డారో చెప్పాలని చంద్రబాబును టిడిపి నేతలు నిలదీయాలన్నారు. దళితుల హక్కులు కాలరాస్తున్న మోడీకి రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలన్నారు.

హోదా కోసం పట్టుబట్టి..

హోదా కోసం పట్టుబట్టి..

బిజెపి నేతలు ప్రత్యేక హోదా కోసం నాడు పట్టుబట్టి ఇప్పుడు పక్కన పెట్టారని డి రాజా అన్నారు. రాజ్యసభలో నాడు మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను నరేంద్ర మోడీ నెరవేర్చాలన్నారు. ప్రధాని మోడీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారని శరద్ యాదవ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+