ఏపీలో ఎవరూ బయటకు రావొద్దు.. ప్లీజ్!

ఏపీలో రోజురోజుకు ఎండలు పెరుగడంతోపాటు వడగాడ్పులు వీస్తున్నాయి. కొద్దిరోజులపాటు వాతావరణం ఇలాగే కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 195 మండలాల్లో వడగాడ్పులు, 147 మండలాల్లో వేడి వాతావరణం నెలకొననుంది. కోస్తా, రాయలసీమ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలియజేస్తున్నారు.

తప్పనిసరైతేనే రండి
అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలనని, వెళ్లే సమయంలో గొడుగు ధరించాలని, కాటన్ దుస్తులు వేసుకోవాలని, చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దాహం వేయకపోయినా తరుచుగా నీరు తాగుతుండాలని, నిమ్మకాయ రసం తీసుకోవడంతోపాటు ఎలక్ట్రాల్ పౌడర్లు, ఓఆర్ఎస్, కొబ్బరి బొండాలు తీసుకోవాలని, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు జిల్లాల్లో తీవ్రమైన వేడి వాతావరణం నెలకొంటుందని, తప్పనిసరి అయితేనే బయటకు రావాలని చెబుతున్నారు.

alert No one should come out in andhra pradesh

జూన్ లో అధిక వర్షపాతం నమోదవుతుంది
నైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ విశ్లేషణ చేసింది. దేశంలోనే అత్యధిక వర్షాధారిత వ్యవసాయ ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. జూన్ నెలలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి వాతావరణం అనుకూలంగా ఉందని, ఈనెల 31వ తేదీన రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందన్నారు. మొన్నటివరకు ఏపీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు మండిస్తుంటే మరోవైపు తేలికపాటి జల్లులు కురిశాయి. ప్రస్తుతం మాత్రం రాష్ట్రమంతా ఒకే తరహా వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+