కమ్ బ్యాక్ అవుతున్నారా?

ప్రముఖ నటుడు, కమేడియన్ అలీ.. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీ ఇవ్వనున్నారా?.. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారా? అంటే అవుననే సమాధానమే ఇచ్చే ఫొటో ఇది. గతంలో పార్టీలో యాక్టివ్ గా పని చేశారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మైనారిటీ ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు.

ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పరాజయాన్ని చవి చూడటంతో అలీ రాజకీయ ప్రస్థానానికి ఒక్కసారిగా పుల్ స్టాప్ పడింది. ఫలితాలు వెలువడిన అతి కొద్దిరోజుల్లోనే రాజకీయాలకు దూరం అయ్యారు. వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాకుండా ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారు. పూర్తిస్థాయిలో సినిమాలకు పరిమితం అయ్యారు. ఆ తర్వాత ఎక్కడ కూడా రాజకీయ వేదికలపై కనిపించలేదు అలీ.

Ali and Vallabhaneni Vamsi A Conversation that Matters

తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వంశీని అలీ మర్యాదపూరకంగా కలిశారు. శాలువ కప్పి గౌరవించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైఎస్ఆర్సీపీ గ్రూప్ లల్లో సర్క్యులేట్ అవుతోంది. మళ్లీ అలీ పార్టీలో యాక్టివ్ అవుతున్నారనే ప్రచారానికి తెర తీసినట్టయిందీ ఫొటో. ఈ భేటీకి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేదనే వాదనలూ ఉన్నాయి.

వంశీ బెయిల్ పై విడుదల కావడం, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నందున.. అలీ ఆయనను మర్యాదపూరకంగా కలిశారని చెబుతున్నారు. వంశీ కూడా చలన చిత్ర పరిశ్రమకే చెందిన వ్యక్తి కావడం, అలీ పార్టీలో పని చేయడం వల్ల వారిద్దరి మధ్య స్నేహపూరక సంబంధాలు ఏర్పడ్డాయని, ఆ పరిచయంతోనే వల్లభనేని వంశీని అలీ మర్యాదపూరకంగా కలిశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతోన్నాయి. 2029లో ఎన్నికలు సమీపించే సమయానికి వైఎస్ఆర్సీపీలో మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలు లేకపోలేదనీ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+