'బ్రహ్మణితో పెళ్ళి ఇలా, నాన్న ఇంట్లో సరదాగా, ఎన్టీఆర్ 5 దోశెలంటే భయం'

Posted By:
Subscribe to Oneindia Telugu

చదువు పూర్తిచేసుకొని హైద్రాబాద్‌కు చేరుకొనే సమయానికి హెరిటేజ్ సంస్థ రూ.60 కోట్లు నష్టాల్లో ఉంది.సంస్థ నుండి బయటకు వచ్చేసమయానికి రూ.100 కోట్ల లాభానికి హెరిటేజ్‌ను తీసుకువచ్చాను. టర్నోవర్‌ కూడ పెరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ చెప్పారు. ఇంట్లో నాన్న చాలా సరదాగా ఉంటారు. హైద్రాబాద్‌లో ఉన్న సమయంలో సచివాలయం నుండి ఇంటికి వచ్చే సమయంలో దేవాన్ష్‌ కోసం ప్రత్యేకంగా బాబు షాపింగ్ చేసేవారని లోకేష్ గుర్తు చేశారు.

బాల్యం నుండి మంత్రి పదవిని చేపట్టే వరకు ఏపీ మంత్రి నారా లోకేష్ ఓ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. చిన్నతనంలో ఎలా గడిచిపోయిందో లోకేష్ వివరించారు.

పార్టీ పదవిని నిర్వహించేందుకే ఇష్టమని నారా లోకేష్ చెప్పారు. అయితే పార్టీ సీనియర్ల సూచన మేరకే మంత్రి పదవిని చేపట్టాల్సి వచ్చిందని లోకేష్ వివరించారు. పార్టీ పదవి నుండి మంత్రి పదవిని చేపట్టే వరకు కొనసాగిన జర్నీని లోకేష్ గుర్తుచేసుకొన్నారు.

నారావారిపల్లెలో కూడ రోహిత్‌తో కలిసి ఏ రకంగా తన బాల్యం గడిచిపోయిందనే విషయాన్ని కూడ లోకేష్ ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. చిన్నతనంలో బాలకృష్ణ చేసిన కామెంట్లను కూడ లోకేష్ గుర్తుచేశారు.

బాల్యమంతా సరదాగా గడిచింది

బాల్యమంతా సరదాగా గడిచింది


బాల్యమంతా సంతోషంగా గడిచిపోయిందని మంత్రి లోకేష్ గుర్తుచేసుకొన్నారు. చిన్నప్పుడు మెహిదీపట్నంలోని ఇంట్లో అందరం కలిసి ఆడుకునేవాళ్లం. పండగలొస్తే అబిడ్స్‌లో తాతయ్య (ఎన్‌టిఆర్‌) ఇంటికి వెళ్లేవాళ్లే విషయాన్ని లోకేష్ గుర్తుచేశారు. బాలయ్య మామ ఇంటికి వెళ్లి కూర్చునేవాళ్లం. ఆ ఇంట్లో హోమ్‌ థియేటర్‌ ఉండేది. పదిమంది కలిసి సినిమా చూడడమే. అప్పట్నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. కొన్నేళ్లు బాలయ్య మామ ఇంట్లోనే మేం ఉండేవాళ్లం. మామ చెన్నైలో ఉండేవారు. ఎప్పుడైనా ఇంటికొచ్చినప్పుడు...‘ఓయ్‌! ఇది నా ఇల్లు. నువ్వెందుకు ఉన్నావ్‌. వెళ్లిపో...' అని ఆట పట్టించేవారని లోకేష్ చెప్పారు.

భయంతో ఐదు దోశెలు తినేవాడిని

భయంతో ఐదు దోశెలు తినేవాడిని

ఎన్టీఆర్‌తాత మాతో చాలా సరదాగా ఉండేవారని లోకేష్ గుర్తుచేసుకొన్నారు. పిల్లలంతా కలిసి గండిపేటకు వెళ్ళాలని ఎన్‌టిఆర్ తాతయ్యను అడిగారు. అప్పటికే ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని లోకేష్ గుర్తుచేసుకొన్నారు. స్వయంగా ఎన్‌టిఆర్ పెద్ద కారు తీసి.. 12మంది పిల్లల్నీ ఎక్కించుకుని తీసుకెళ్ళినట్టు చెప్పారు.ప్రతి పుట్టినరోజునాడూ అమ్మానాన్నలు తాతయ్య ఆశీర్వాదం తీసుకోవడానికి పంపేవాళ్లు. ఆయన ఆరోజు కనీసం ఐదు పెసరట్లు తినిపించేవారు. ‘ఊ! తిను...' అంటే భయంతో తినేసేవాణ్ని అని లోకేష్ చెప్పారు.

నారావారిపల్లెలో రోహిత్‌తో ఆట

నారావారిపల్లెలో రోహిత్‌తో ఆట

ప్రతి వేసవి సెలవులకూ నారావారిపల్లె వెళ్లేవాళ్లం. కానీ నానమ్మ మాత్రం మమ్మల్ని కనిపెట్టుకుని ఉండేది. ఎర్రటి ఎండల్లో నేను, రోహిత్‌, గిరీష్‌ బాగా ఆడుకునేవాళ్లం. సాయంత్రం ఇంటికొచ్చేసరికి కర్రతో నానమ్మ సిద్ధంగా ఉండేది. మేం పరుగుపెడుతుంటే...ఆ చీపురుకట్ట అలానే పట్టుకుని కొద్దిదూరం పరిగెత్తి ఆగిపోయేది. ఇంట్లో వేడినీళ్ల తొట్టెలు ఉండేవి. వాటిలో స్నానం చేసే వాడినంటూ లోకేష్ గుర్తుచేసుకొన్నారు.

చదువు కోసం అమెరికాకు

చదువు కోసం అమెరికాకు

బాల్యం నుంచి పదో తరగతి వరకూ జూబ్లీహిల్స్‌లోని భవన్స్‌లోనే చదివినినట్టు లోకేష్ చెప్పారు. హైద్రాబాద్‌లోనే ఇంటర్ చదివాను. నాణ్యమైన చదువుకోసం అమెరికాకు వెళ్ళినట్టు చెప్పారు. కార్నెగీ మిలన్‌ యూనివర్సిటీలో చేరా. ఇండియాలో చదువుకు అమెరికాలో చదువుకు తేడా ఉందన్నారు. సర్ధుకొనేందుకు నాలుగు మాసాల సమయం పట్టిందని లోకేష్ చెప్పారు. అక్కడే బీఎస్సీ పూర్తిచేశా. ఆ తర్వాత రెండేళ్ల పాటు ప్రపంచబ్యాంకులో ఇ-గవర్నెన్స్‌ విభాగంలో పనిచేశాను. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ పూర్తిచేశాను.

హెరిటేజ్‌ను లాభాల్లోకి

హెరిటేజ్‌ను లాభాల్లోకి

అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ వ్యాపారం హెరిటేజ్‌లోకి ప్రవేశించినట్టు లోకేష్ చెప్పారు.. నేను చేరేసరికి రూ.60కోట్ల నష్టంతో ఉంది సంస్థ. రూ.250కోట్ల అప్పులు ఉన్నాయి. అయితే హెరిటేజ్‌ను బాధ్యతలను చేపట్టిన తర్వాత వ్యాపారాన్ని గాడిలో పెట్టినట్టు చెప్పారు. 2013లో నేను ఎగ్జిక్యూటివ్‌ డైరక్టరుగా వైదొలగేనాటికి సంస్థ లాభం రూ.100కోట్లు. అప్పు రూ.100కోట్లకు తగ్గింది. టర్నోవరు పెరిగిందని లోకేష్ గుర్తు చేశారు.

 పార్టీ బాధ్యతలంటేనే ఇష్టం

పార్టీ బాధ్యతలంటేనే ఇష్టం

పార్టీలో సంస్థాగత పనులు నిర్వహించాను. నాకు పార్టీ పదవే ఇష్టంగా ఉండేది. 2012లో ఉప ఎన్నికలు జరిగాయి. అన్ని స్థానాల్లోనూ ఓడిపోయాం. అప్పటి సర్వేల ప్రకారం రాష్ట్రం మొత్తంమీద 30 స్థానాలు మాత్రమే వచ్చే పరిస్థితి. 2013లో పూర్తిస్థాయిలో పార్టీకే సమయం కేటాయించడం ప్రారంభించాను. ఒక బాధ్యత అప్పచెబితే దాన్ని పూర్తిచేయడమే లక్ష్యమన్నట్టు పనిచేసే వాడిని. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పదవిలోకి రావాలన్నారు. ‘పార్టీకి సేవ చేయనివ్వండి, నన్ను వదిలేయండి' అనేవాడిని లోకేష్ గుర్తుచేసుకొన్నారు.ఒకరోజు యనమల రామకృష్ణుడు ‘మంత్రివర్గంలో చేరండి, వ్యవస్థకు సంబంధించి లోతైన అవగాహన చేసుకోండి' అని చెప్పారు. అందరూ ఒత్తిడిచేయడంతో కాదనలేక పోయా. ప్రభుత్వంలో ఉంటూ.. నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించినట్టు లోకేష్ చెప్పారు.

బ్రహ్మణితో వివాహ ప్రతిపాదనకు ఒకే

బ్రహ్మణితో వివాహ ప్రతిపాదనకు ఒకే

బ్రహ్మణితో నా వివాహ ప్రతిపాదనను తొలుత నాన్నే తెచ్చారు. ఓసారి సెలవులకు వేరే దేశం వెళ్లినప్పుడు...‘బ్రహ్మణితో పెళ్లి ప్రతిపాదన ఉంది? నీ అభిప్రాయం ఏంటి?' అని అడిగారు. ‘మంచిదేగా!' అని చెప్పా. దేవాన్ష్‌ పుట్టడం అన్నింటికంటే సంతోషమైన విషయమని అనిపిస్తోంది. బ్రహ్మణి నేనూ కుటుంబ విషయాలన్నీ మాట్లాడుకుంటాం. రాజకీయాల గురించీ వ్యాపారం గురించీ చర్చ జరుగుతూనే ఉంటుంది.

నాన్న ఇంట్లో సరదాగా

నాన్న ఇంట్లో సరదాగా

నాన్న ఇంట్లో సరదాగా ఉంటారు. పెళ్లయిన కొన్నాళ్లకు బ్రహ్మణి ‘మామగారంటే చాలా సీరియస్‌ అని బయట అంటూ ఉంటారు. నేను కూడా ఏదో అనుకున్నా. కానీ సరదాగా ఉంటున్నారు' అందో సారి. ఆ మాట నిజమే. దేవాన్ష్‌ పుట్టాక నాన్న కొంత ఎక్కువ సమయం వాడికి కేటాయించేవారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు సీఎం కార్యాలయం నుంచి రాత్రి ఇంటికొచ్చేటప్పుడు... మధ్యలో ఆగి మనవడి కోసం షాపింగ్‌ చేసేవాళ్లని లోకేష్ గుర్తు చేసుకొన్నారు.

అలిపిరి బాంబు దాడి విషాదఘటన

అలిపిరి బాంబు దాడి విషాదఘటన

2003 అక్టోబరు 1... నా జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు. నాన్న మీద అలిపిరి బాంబుదాడి జరిగింది ఆరోజే. అప్పుడు నేను అమెరికాలో చదువుకుంటున్నా. ముందురోజు అర్ధరాత్రివరకు చదువుకుని అలాగే సోఫాలో పడుకుండిపోయా. ఉదయం ఫోన్‌ చేశారు. అలిపిరిలో బాంబుదాడి జరిగిందని చెప్పారు. నాన్నకు ఏమైంది? ఎలా ఉన్నారు?... ఏమీ చెప్పలేదు. 20 నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్‌ చేశారు. నాన్న క్షేమంగా ఉన్నారని చెప్పారు.తన జీవితంలో ఈ ఘటన అత్యంత విషాదకరమైందని ఆయన గుర్తుచేసుకొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Alipiri attack is the very sad incident in my life said Ap minister Nara Lokesh. when I was in America , It was happened said Nara Lokesh.Telugu daily interviewed minister Nara Lokesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X