వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్లాసు గుర్తు గల్లంతేనా - కామన్ సింబల్ కోసం పోరాటం : పవన్ సాధించేనా..!!

|
Google Oneindia TeluguNews

జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఆరు నెలల పాటు ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్దమయ్యారు. దసరా నుంచి తన యాత్ర ప్రారంభించనున్నారు. ప్రతీ జిల్లా కవర్ అయ్యేలా షెడ్యూల్ సిద్దం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు ఖాయమని జనసేన అంచనా వేస్తోంది. పొత్తుల పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. ఆప్షన్ల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో టీడీపీ - బీజేపీ ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ సారి ఎన్నికల్లో కింగ్ లేదా కింగ్ మేకర్ గా జనసేన నిలుస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

జనసేనకు గాజు గ్లాసు కొనసాగేనా

జనసేనకు గాజు గ్లాసు కొనసాగేనా


అయితే, భారీ అంచనాలతో వచ్చే ఎన్నిక లకు సిద్దం అవుతున్న జనసేనకు కీలక సమస్య ఎదురైంది. ఇప్పుడు దీనిని పరిష్కరించుకోవటం పార్టీకి సవాల్ గా మారుతోంది. 2019 ఎన్నికల్లో జనసేన గాజు గ్లాసు గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో ఒక అసెంబ్లీ సీటు గెలుచుకున్న జనసేన.. కూటమిగా 5.6 శాతం ఓట్లు సాధించింది. జనసేన సింగిల్ గా పార్లమెంట్ ఎన్నికల్లో 6.30 శాతం.. అసెంబ్లీ ఎన్నికల్లో 5.54 శాతం ఓట్ షేర్ దక్కించుకుంది. ఆ తరువాత జనసేనకు కామన్ సింబల్ పైన సమస్య మొదలైంది. తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్‌ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తు చేస్తోంది.

2025 వరకు ఛాన్స్ లేదంటూ ప్రచారం

2025 వరకు ఛాన్స్ లేదంటూ ప్రచారం


బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికల్లో కూడా ఇలాగే ఇంకో అభ్యర్ధికి కేటాయించారు. ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేస్తున్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి షెక్ జలీల్ కు ఎన్నికల కమీషన్ గాజుగ్లాసు చిహ్నాన్ని కేటాయించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ విషయంలోనూ జనసేన నిర్ణయం కామన్ సింబల్ పైన ఎఫెక్ట్ చూపింది. గ్రేటర్ లో పోటీ చేయకపోయినా..ఇతర మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని..తమకు గాజు గ్లాసు కామన్ సింబల్ గా కొనసాగించాలని జనసేన ఎన్నికల సంఘాన్ని కోరింది. గత ఏడాది ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కామన్ సింబల్ దక్కలేదు. ఉప ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేయలేదు.

కామన్ గుర్తు లేకుంటే..సమస్యలే

కామన్ గుర్తు లేకుంటే..సమస్యలే


అయితే, 2025 వరకు తిరిగి గాజు గ్లాసు కామన్ సింబల్ గా దక్కే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో..ఇప్పుడు పొత్తులు - ఎన్నికల్లో గెలుపు కీలకంగా భావిస్తున్న జనసేన నేతలు కామన్ సింబల్ దక్కించుకోకపోతే నష్టం తప్పదనే అందోళన అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. దీంతో.. ఇప్పుడు జనసేన నేతలు అటు ఎన్నికల సంఘం..ఇటు న్యాయ పరంగా తమ ముందున్న అవకాశాలను పరిశీలన చేస్తున్నారు. కామన్ సింబల్ తోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఎంత వరకు ఫలిస్తాయనేది ఇప్పుడు వేచి చూడాలి.

English summary
As per reportsJanasena lost rerved party symbol glass. Janasena no chance to get common symbol up to end of 2025
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X