Ysrcp Samajika Sadhikara Yatra: రేపట్నుంచి వైసీపీ సామాజిక బస్సు యాత్రలు-మూడు దశల్లో ఇలా...
ఏపీలో గత నాలుగున్నరేళ్లలో వెనుకబడిన, షెడ్యూల్డ్, మైనార్టీ వర్గాలకు తామేం చేశామో చెప్పుకునేందుకు అధికార వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు చేపట్టబోతోంది. రేపటి నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ యాత్రలు చేపడుతోంది. ఎన్నికలకు ముందు ఆయా వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు వైసీపీ చేపడుతున్న ఈ కార్యక్రమం ఆ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మంగా మారింది. రాష్ట్రంలో ఎన్నికల అజెండాపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ యాత్రకు కీలకంగా మారాయి.
బస్సు యాత్ర ఇలా...
వైసీపీ చేపడుతున్న సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో జరగబోతోంది. తొలిదశలో 39 నియోజకవర్గాల్లో సాగే బస్సు యాత్ర అక్టోబర్ 26న ప్రారంభమై నవంబర్ 9 నాటికి ముగుస్తుంది. ఇందుకోసం రాష్ట్రాన్ని ఉత్తర, మధ్య మరియు దక్షిణ ఆంధ్రాగా మూడు ప్రాంతాలుగా విభజించారు. ప్రతి రోజు ఒక్కో ప్రాంతంలో ఒక్కో నియోజకవర్గం చొప్పున అలా మూడు చోట్ల యాత్ర సాగుతుంది.

SC, ST, BC, మైనారిటీ వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర మధ్యాహ్న భోజన సమావేశంతో ప్రారంభమవుతుంది. యాత్ర సాయంకాలం వరకు ప్రజలను ఉత్సాహపరుస్తూ సాగునుంది. చివరిగా ఆ నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహిస్తారు.

మధ్యాహ్న భోజన సమావేశాలు ఇలా..
ప్రతీ నియోజకవర్గంలో బస్సు యాత్ర భోజనంతో ప్రారంభమవుతుంది. అందులో ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు , ముఖ్య నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 200 మంది నాయకులు కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం మీడియా ప్రతినిధులతో సమావేశమై యాత్ర గురించి వివరిస్తారు. బస్సు యాత్ర వెళ్లే మార్గంలో నాయకులు ముందుగా నిర్ణయించిన స్టాప్‌లలో ప్రజలతో మమేకమయ్యే విధంగా కొన్ని స్టాప్ లను పెట్టి స్వాగతించే విధంగా బోర్డులు పెడతారు. అటువంటి చోట్ల ఆగి బస్సుపై ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ముఖ్య నాయకులు మాట్లాడతారు.

బహిరంగసభలు ఇలా..
ప్రతీ నియోజకవర్గంలో బస్సు యాత్ర చివరిగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. అక్కడ, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. దాదాపు పలు ప్రాంతాల నుంచి 10,000 మంది ప్రజలు ఈ సభల్లో పాల్గొంటారని అంచనా. అంతేకాకుండా అక్కడి స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా మైనార్టీ నాయకులు పాల్గొని వారి సంఘలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇందులో స్థానికంగా ఉండే ఏ సంఘం అయినా పాల్గొనవచ్చు.












Click it and Unblock the Notifications