వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు పెద్ద ప్లానే వేశారు, కానీ: ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాల

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

బాబు, లోకేష్‌లు..

బాబు, లోకేష్‌లు..

పేద బ్రాహ్మణుల వేద విద్య కోసం సదావర్తి భూములను రాజా వాసిరెడ్డి వారసులు రాసిచ్చారని తెలిపారు. అవి బ్రాహ్మణ భూములు అని, ప్రభుత్వ భూములు కాదని ఎమ్మెల్యే ఆళ్ల అన్నారు. పేద బ్రాహ్మణుల ఆస్తిని తక్కువ ధరకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ దక్కించుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు.

సుప్రీం మొట్టికాయలు వేయడంతో...

సుప్రీం మొట్టికాయలు వేయడంతో...

ఈ విషయాన్ని ప్రజలు గమనించడంతో ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని టీడీపీ నేతలు తమపై నిందలు వేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సదావర్తి భూములను కాపాడేందుకు తాము కోర్టును ఆశ్రయించామని తెలిపారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం వేల పాట నిర్వహించిందని అన్నారు.

అబద్ధాలు చెప్పించారు..

అబద్ధాలు చెప్పించారు..

అయితే, రెండవ విడత నిర్వహించిన బహిరంగ వేలంలో అత్యధిక బిడ్డర్‌గా నిలిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రధాన అనుచరుడు బద్వేలు శ్రీనివాసులు రెడ్డి గడువులోగా డబ్బులు చెల్లించని విషయం తెలిసిందే. ఆ తర్వాత కేసులు, పిటిషన్లు అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తోందని శ్రీనివాసులు రెడ్డితో సీఎం చంద్రబాబు.. పత్రికా ముఖంగా అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్యే రామకృష్ణా అన్నారు.

అప్పనంగా కొట్టేయాలన్నదే బాబు ప్లాన్..

అప్పనంగా కొట్టేయాలన్నదే బాబు ప్లాన్..

వేలంపాటలో సదావర్తి భూములను దక్కించుకున్న ఆయనను తాము అభినందించి, స్వాగతించామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక వేలంపాటపై మంత్రి మాణిక్యాలరావు, దేవాదాయ శాఖ కమిషనర్ చెప్పే మాటలకు పొందన లేదన్నారు. సదావర్తి భూములను అప్పనంగా కొట్టేయాలన్న చంద్రబాబు ప్లాన్ అని ఆర్కే ఆరోపించారు.

సదావర్తి భూముల కేసు విచారణ వాయిదా

సదావర్తి భూముల కేసు విచారణ వాయిదా

సదావర్తి భూములపై దాఖలైన కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ వేలంలో అత్యధిక ధరకు కోట్‌ చేసిన వ్యక్తి ముందుకు రావట్లేదని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ భూములపై రేపు సుప్రీం కోర్టులో విచారణ ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

English summary
YSRCP MLA Alla Ramakrishna Reddy on Thursday lashed out at Andhra Pradesh CM Chandrababu Naidu for Sadavarthi lands issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X