చంద్రబాబుకు సెంటు స్థలం కూడా లేదు... దరఖాస్తు చేసుకో ఇల్లిస్తాం అన్న ఎమ్మెల్యే ఆర్కే
కృష్ణా నదికి వస్తున్న వరద ప్రభావం చంద్రబాబు ఉండవల్లి నివాసంపై పడుతుంది. చంద్రబాబు ఇల్లు ముంపుకు గురవుతుంది. ఇక ఈ నేపధ్యంలో చంద్రబాబు నివాసం ముంపుపై వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్లతో ఫోటోలు, వీడియోలు తీయటం వంటి ఘటనల నేపధ్యంలో రాజకీయ వేడి రగులుకుంది. మాజీ మంత్రి దేవినేని ఉమ ఈరోజు కావాలనే కృత్రిమ వరదను ప్రభుత్వం సృష్టించిందని , ముందస్తు చర్యలు తీసుకుంటే ముంపు సమస్య వుండేది కాదని వ్యాఖ్యానించారు. మానిటరింగ్ సరిగా లేకనే ఇప్పుడీ ఉపద్రవం వచ్చిందని పేర్కొన్నారు దేవినేని ఉమా.. కావాలని చంద్రబాబు ఇంటిని ముంపుకు గురి చేసే కుట్ర అని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్క.

దేవినేని ఉమా వ్యాఖ్యలపై మండిపడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
ఉమా చేసిన వ్యాఖ్యలను బట్టే టీడీపీ నేతలు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతుందని ఆర్కే పేర్కొన్నారు. ‘దేవినేని ఉమ గారిని నేను ఒక్కటే అడుగుతున్నా.. అయ్యా దేవినేని ఉమ గారూ.. ఓటుకు నోటు కేసులో విచారణ ప్రారంభం కాకముందే హైదరాబాద్ నుంచి పారిపోయారు. చంద్రబాబు వారికి చిక్కకుండా, దొరకకుండా ఉండేందుకు మీరు చాలా కష్టపడ్డారు.అప్పుడు కృష్ణా బ్యారేజ్ ఎగువన పడవేసుకుని మరీ తిరిగి అప్పుడు ఇవన్నీ అక్రమ నిర్మాణాలేననీ, వీటిని తొలగిస్తామని మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి. అని ప్రశ్నించారు. ఇక ఐదేళ్లలో ప్రపంచస్థాయి రాజధాని కడతామని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు.కనీ ఇప్పటి వరకు ఆయన రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కొన్నారా చెప్పండి అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబుకు సొంత ఇల్లయినా ఉందా ? చంద్రబాబుది అక్రమ నివాసమే కదా అన్న ఆర్కే
కనీసం చంద్రబాబుకు సొంత ఇల్లు అయినా ఉందా? మీరు అమరావతి రాజధాని అని ప్రకటించగానే అప్పటి ప్రతిపక్ష నేత జగన్ అక్కడే ఇల్లు, ఆఫీసు కట్టుకున్నారు. అంటే రాజధాని నిర్మాణంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉన్నట్లా? లేక జగన్ కు చిత్తశుద్ధి ఉన్నట్లా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుది అక్రమ నివాసమేనని తేల్చి చెప్పారు. వరద వస్తుందని తెలిసి హైదరాబాద్ పారిపోయిన చంద్రబాబు ఆయన నివాసంలోని వాహనాలను హ్యాపీ రిసార్ట్స్ కు, ఫర్నీచర్ ను ఇంటిలోని మొదటి ఫ్లోర్ కు తరలించారని ఎద్దేవా చేశారు.

ఇంటికోసం దరఖాస్తు పెట్టుకో.. చంద్రబాబు .. నీకు ఓ ఇల్లిస్తాం అన్న మంగళగిరి ఎమ్మెల్యే
ఇక చంద్రబాబు నివాసం ముంపుకు గురైన సంగతి చంద్రబాబు మీడియా ముందుకు రాకుండా ఇతరులతో మాట్లాడించడం భావ్యం కాదని దుయ్యబట్టారు . చంద్రబాబు తనకు ఇల్లు లేదనీ, వాచీ, ఉంగరం లేదని చెబుతున్నారని మా జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఉగాది నుంచి ఇల్లు లేని వారందరికి పక్కా ఇళ్లు మంజూరు చేయబోతున్నారు. కాబట్టి చంద్రబాబు వెళ్లి దరఖాస్తు పెట్టుకో అని సెటైర్ వేశారు . మీ దగ్గరకు కూడా మా వాలంటీర్ వస్తాడు. సెంటో, సెంటున్నరో స్థలం ఇస్తారు. లేదా మీరు లక్షల కోట్ల అవినీతి చేశారు కదా.. ఆ డబ్బులు కట్టకున్నా ప్రభుత్వం మీ ఇంటికి భద్రతను కల్పిస్తుంది అని రామకృష్ణా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications