కిరణ్ రాయల్‌పై ఆరోపణలు.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కిరణ్ రాయల్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ కాన్‌ప్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అంతేగాక, అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

ఈ పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పీ హరిప్రసాద్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. సమాజానికి ప్రయోజనం లేని విషయాలను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ సూచించినట్లు పేర్కొన్నారు.

Allegations against Kiran Royal Pawan Kalyan s key orders

కాగా, తనకు కోటి రూపాయలు ఇవ్వాలంటూ కిరణ్ రాయల్‌పై ఓ మహిళ ఆరోపణలు చేయడం, అందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడం కలకలం రేపాయి. 2013లో తీసుకున్న డబ్బులు ఎప్పుడో తిరిగి ఇచ్చేశానని, కానీ, ఇచ్చేసిన డబ్బులను, మార్ఫింగ్ వీడియోలతో వైసీపీ నేతలు ఆ మహిళతో కలిసి కుట్ర పన్ని ఇలా చేస్తున్నారని కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. ఈ అంశం త్వరలోనే కోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నానని.. తన ఫోన్ కేసు హైకోర్టులో ఉందని తెలిపారు.

కాగా, కిరణ్ రాయల్ తన వద్ద కోటి రూపాయలకుపైగా అప్పు తీసుకుని మోసం చేశారంటూ ఓ మహిళ సెల్ఫీ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. కోటి రూపాయల నగదుతోపాటు 25 సవర్ల బంగారం కూడా తీసుకున్నారని కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసింది. ఆ మొత్తం తిరిగి ఇవ్వాలని అడుగుతుంటే బెదిరిస్తున్నారని, తనకు చావే శరణ్యమని సదరు మహిళ సెల్ఫీ వీడియోలో పేర్కొంది. ఈ వీడియో నెటింట వైరల్ కావడంతోపాటు కిరణ్ రాయల్‌కు సంబంధించిన ఓ ఆడియో, వీడియోలు లీక్ కావడం కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+