అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టిన తారక్ భార్య ప్రణతి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఒకర్నొకరు ప్రేమగా బావా.. బావా అని పిలుచుకుంటారు. సోషల్ మీడియాలో కూడా ఇలా బావా అని పిలుచుకోవడం చాలాసార్లు చూశాం.
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని జూనియర్ భార్య లక్ష్మీప్రణతి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టింది. దీంతో బన్నీ ప్రణతికి ఏకంగా కోటిరూపాయల విలువైన డైమండ్ వాచ్ ను బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది. అధికారికంగా ఈ విషయం బయటకు రానప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇరువురి అభిమానులు దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంటోంది. తారక్ పక్కన జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో దీన్ని చిత్రీకరిస్తున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీలో ఒకేసారి విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఇది విడుదల కానుంది.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నారు. దీనికి సుకుమార్ దర్శకుడు. పుష్ప సినిమాలో కనపరిచిన నటనకు ఇటీవలే అల్లు అర్జున్ జాతీయ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి 69 సంవత్సరాల జాతీయ అవార్డుల చరిత్రలో తొలిసారి తెలుగు కథానాయకుడు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు. దీనిపై తెలుగు ప్రజలంతా ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు. పుష్ప2 షూటింగ్ ఆలస్యమవుతుండటంతో ఇది ఎప్పుడు విడుదల కానుందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications