పవన్ కళ్యాణ్ బాబాయ్..! మెగా వార్ ముగించేసిన అల్లు అర్జున్
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 (Pushpa-2) సినిమా డిసెంబర్ 5న విడుదలై బ్లాక్ బ్లాస్టర్ టాక్‌తో రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 12500 స్క్రీన్లలో విడుదలైంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 450 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్ల సాధించింది. దీంతో భారత సినిమా రంగంలో తొలి రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్ట్ క్రియేట్ చేసింది.
ఈ నేపథ్యంలో పుష్ప-2 చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మాట్లాడారు. సినిమా నిర్మాతలు, చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చి, ఇన్ని రికార్డులు సాధించడానికి కారణమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అయితే, మరోసారి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా చెబుతున్నా.. కళ్యాణ్ బాబాయ్ మీకు థ్యాంక్స్ అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న మెగా అభిమానులు కేకలు వేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తమ సినిమాను ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో గత కొద్ది రోజులుగా మెగా, అల్లు అభిమానుల మధ్య కొనసాగుతున్న సోషల్ మీడియా వార్ ముగిసినట్లేనని తెలుస్తోంది. ఇటీవల తన సక్సెస్ విషయంలో చేసిన చేసిన వ్యాఖ్యలకు వచ్చిన వ్యతిరేకతను తాజా వ్యాఖ్యలతో అల్లు అర్జున్ చల్లబర్చినట్లయింది. దీంతో మెగా, అల్లు అభిమానులు మళ్లీ కలిసిపోతారని అంతా అనుకుంటున్నారు.
Icon Star @alluarjun thanks the governments of Andhra Pradesh & Telangana for the immense cooperation they have given to the film.#Pushpa2TheRule RULING IN CINEMAS #Pushpa2#WildFirePushpa
— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2024
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @resulp… pic.twitter.com/q1S3boqXhf
మరోవైపు, సంధ్య ఘటనపై స్పందించిన అల్లు అర్జున్.. సినిమా విషయాలను కూడా పంచుకున్నారు. పుష్ప2 విజయమంతా దర్శకుడు సుకుమార్‌దే అని అల్లు అర్జున్ అన్నారు. తనను ఎత్తుకొన్ని ఎక్కడో పెట్టాడని సుకుమార్‌ని కొనియాడారు. తొలిరోజు వచ్చిన 'పుష్ప 2' కలెక్షన్లే తన సినిమా ఎంత మంది చూశారనడానికి నిదర్శనమని అన్నారు. ప్రాంతీయ సినీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి దేశంలో ఉన్నతస్థాయిలో ఉందని వెల్లడించారు.
సంధ్య ఘటనపై మరోసారి
సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనపై మరోసారి అల్లు అర్జున్ స్పందించారు. తాను మూడేళ్ల తర్వాత సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి వెళ్లానని తెలిపారు. అయితే థియేటర్ బయట అభిమానుల ఒత్తిడి ఉండటం వల్ల తాను పూర్తి సినిమా చూడకుండానే వెళ్లిపోయానని చెప్పారు. రేవతి చనిపోయారనే విషయం తనకు ఒకరోజు తర్వాత తెలిసిందని.. అయితే, స్పందించడానికి తనకు సమయం పట్టిందని, అందుకే కొంచెం ఆలస్యంగా స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు అల్లు అర్జున్. రేవతి చనిపోవడం బాధగా ఉందన్నారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామన్నారు. రూ. 25 లక్షల సాయం ప్రకటించినట్లు చెప్పిన అల్లు అర్జున్.. త్వరలోనే ఆ కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications