తిరుపతికి వెళ్ళే ఆ కొత్త రైల్వేలైన్ తో పాటు, ప్రకాశం జిల్లాకు రైల్వే బ్రహ్మరథం!

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులలో పురోగతి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త రైల్వే ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే ప్రాజెక్టుల దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు, దొనకొండ మధ్య కొత్త రైల్వే మార్గానికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ప్రకాశం జిల్లా వాసులు సంతోషంలో ఉన్నారు.

వేగంగా రైల్వే లైన్, పొదిలి రైల్వే స్టేషన్ పనులు
ఈ ప్రాజెక్టుతో ప్రకాశం జిల్లా ముఖచిత్రం మారుతుందని,పొదిలి రైల్వే స్టేషన్ ఒక ప్రధానమైన కూడలిగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఏపీలో నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పొదిలిలో నిర్మితమవుతున్న కొత్త రైల్వే స్టేషన్ కూడా దాదాపుగా రెడీ అవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థల సమస్యలు పరిష్కారమై పనులలో వేగం పెరిగింది.

Along with the new railway line to Tirupati the railway development for Prakasam district

పొదిలి మెయిన్ జంక్షన్ గా
ఇప్పటికే కనిగిరి వరకు పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి దర్శి స్టేషన్ వరకు రైళ్లు నడిపేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే డెమో రైలు నడిపిన అధికారులు ఈ మార్గంలో రైళ్లను నడపడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం 87 కిలోమీటర్ల మేర ఒంగోలు దొనకొండ మధ్య వస్తున్న రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే పొదిలి ముఖ్య జంక్షన్ గా మారుతుందని భావిస్తున్నారు.

పొదిలి జంక్షన్ లో కలిసే మూడు రైల్వే మార్గాలు
ఈ మార్గం పొదిలి మరియు చీమకుర్తి మీదుగా సాగుతుందని దీంతో జిల్లాలోని తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతుందని అంటున్నారు. ఈ మూడు రైల్వే మార్గాలు పొదిలి జంక్షన్ లో కలవడం విశేషం ఇక మరోవైపు నడికుడి శ్రీకాళహస్తి ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా ముఖచిత్రం మారడంతో పాటు, పొదిలి రైల్వే స్టేషన్ ఒక ప్రధాన కూడలిగా రూపుదిద్దుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ తో తిరుమలకు ఈజీ జర్నీ
మరోవైపు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు శరవేగంగా సాగుతూ చివరి దశకు చేరుకుంటున్నాయి ఈ లైను పామూరు మీదుగా ఉదయగిరి వైపు వెళ్లి నెల్లూరు జిల్లా మీదుగా, తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి వరకు విస్తరిస్తుంది. ఈ రైల్వే లైన్ తో హైదరాబాద్ నుండి తిరుమలకు వెళ్లే భక్తులకు సౌకర్యం కలుగుతుంది. ఇది మార్గంలో ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది.

ప్రకాశం జిల్లా మీదుగా నాలుగు రైల్వే లైన్లు
ఒంగోలు దొనకొండ రైల్వే లైన్, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు పూర్తయితే ప్రకాశం జిల్లా మీదుగా మొత్తం నాలుగు రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తాయి. ఇది ప్రకాశం జిల్లా అభివృద్ధికి గణనీయంగా దోహదం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+