విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబేడ్కర్‌పై నో: జగన్, రోజా సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా సస్పెండ్, వీరే...

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను అందర్నీ శాసన సభ నుంచి శుక్రవారం నాడు సస్పెండ్ చేశారు. అంబేడ్కర్ పైన చర్చ అనంతరం కాల్ మనీ పైన చర్చిద్దామని ప్రభుత్వం చెప్పినప్పటికీ వైసిపి సభ్యులు తమ ఆందోళనను విరమించలేదు.

సభను పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వైసిపి సభ్యులను సస్పెండ్ చేస్తూ ప్రతిపాదన చేశారు. ఆయన ఎమ్మెల్యల అందరి పేర్లు చదివారు. అంబేడ్కర్ పైన చర్చ ముగిసేవరకు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అంబేడ్కర్ పైన చర్చను అడ్డుకున్నందుకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. జగన్, రోజా సహా ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేశారు. దీంతో, విపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి ఆందోళన తెలిపారు.

Along YS Jagan and Roja.. all YSR Congress MLAs suspended

పోడియం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోజా టిడిపికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ కోడెల.. సస్పెండ్ అయిన సభ్యులు సభను వదిలి వెళ్లాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

సస్పెండ్ చేసినా బయటకు వెళ్లకపోవడంతో డిప్యూటీ స్పీకర్ మార్షల్స్‌ను పిలిచారు. వారిని మార్షల్స్ బయటకు పంపించారు. బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

సస్పెండైన వారు వీరే..

జగన్, రోజా, జలీల్ ఖాన్, జ్యోతుల నెహ్రూ, అమర్నాథ్ రెడ్డి, అంజద్ బాషా, అనిల్ కుమార్, అశోక్ రెడ్డి, చాంద్ బాషా, గౌరు చరితా రెడ్డి, డేవిడ్ రాజు, బాలనాగి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, కళావతి, జయరాములు, కల్పన, మణిగాంధి, ఎస్వీ మోహన్ రెడ్డి, ముస్తఫా, ముత్యాల నాయుడు, భూమా నాగిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, నారాయణ స్వామి, కుప్పా శ్రీవాణి, రఘుపతి, రఘురామి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజన్న దొర, రక్షణ నిధి, రాజేంద్రనాథ్, రాజేశ్వరి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, రామారావు, పి రవీంద్రనాథ్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, సాయిప్రసాద్ రెడ్డి, సంజీవయ్య, సర్వేశ్వర రావు, శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రావు, సుబ్బారావు, సునీల్ కుమార్, పి సునీల్ కుమార్, సురేష్, తిప్పారెడ్డి, వెంకటరమణ మూర్తి, వెంకట ప్రతాప్ అప్పారావు, అఖిల ప్రియ, విశ్వేశ్వర రెడ్డి, పి డేవిడ్ రాజులు సస్పెండయ్యారు.

అంబేడ్కర్‌పై చర్చకు అంగీకరించి, సభలో వ్యతిరేకించారు: చంద్రబాబు

అంబేడ్కర్ పైన చర్చకు బిఏసీలో అంగీకరించిన వారు ఆ తర్వాత సభలోకి వచ్చాక వ్యతిరేకించారన్నారు. అంబేడ్కర్ పైన చర్చ పూర్తయ్యాక కాల్ మనీ పైన చర్చిద్దామని చెప్పామన్నారు. అంబేడ్కర్ పైన పార్లమెంటులోరాజకీయ పార్టీలు అన్నీ చర్చించాయని చెప్పారు. అంబేడ్కర్ పైన చర్చను అడ్డుకోవడం చాలా దారుణమన్నారు. రాజ్యాంగం పైన గౌరవ ప్రపత్తులతో అంబేడ్కర్ పైన చర్చ చేపట్టామన్నారు. రాజ్యాంగంపై, రాజ్యాంగ నిర్మాత
అంబేడ్కర్ పైన చర్చ చారిత్రాత్మకం అన్నారు. రాజ్యాంగ సౌధానికి ప్రాణప్రతిష్ట చేసిన అంబేడ్కర్‌ను స్మరించుకోవడం చారిత్రాత్మకం అన్నారు.

English summary
Along YS Jagan and Roja all YSR Congress MLAs suspended
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X