పార్టీ మారేది లేదు.. కాంగ్రెస్ లోనే కొనసాగుతా : దేవినేని నెహ్రూ
విజయవాడ : మాజీ మంత్రి దేవినేని నెహ్రూ పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో..! విషయంపై స్పందించారు నెహ్రూ. టీడీపీ నేతలు తనతో సంప్రదింపులు జరుపుతున్నది నిజమేనని చెప్పిన నెహ్రూ.. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు.
నెహ్రూ ప్రకటనతో పార్టీ మార్పు ఊహాగానాలకు తెరపడగా.. ఎంపీ పల్లంరాజు జోక్యం మేరకే పార్టీ మార్పుపై ఆయన వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. కాగా, పార్టీ మారేది లేదని నెహ్రూ ప్రకటించడంతో.. టీడీపీ నేతలే ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది.













Click it and Unblock the Notifications