అమరరాజా తరలింపు వదంతి మాత్రమే ; గల్లా జయదేవ్ వ్యాఖ్యలతో బాబుకు షాక్, టీడీపీకి బూమరాంగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెన్నైకి అమర రాజా బ్యాటరీస్ సంస్థ యూనిట్లు తరలిపోతున్నాయి అన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. సాక్షాత్తు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు,లోకేష్ లతో సహా టిడిపి నేతలందరూ అమర రాజా బ్యాటరీస్ సంస్థ తరలిపోతున్నదంటూ అధికార వైసీపీపై పెద్ద ఎత్తున దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జగన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.

ఏపీలో రచ్చ చేసిన అమరరాజా బ్యాటరీస్ దుమారం .. టీడీపీ వర్సెస్ వైసీపీ
అమర రాజా బ్యాటరీస్ తరలిపోతే వేలాది మంది ఉపాధి కోల్పోతారని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని, అమర రాజా బ్యాటరీస్ తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. అమర రాజా బ్యాటరీస్ చెన్నైకి తరలి పోతుందన్న వార్తలతో నిప్పులు చెరిగిన టిడిపి నేతలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నే కాదు, వైసీపీ మంత్రులను సైతం టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఇక అమర రాజా బ్యాటరీస్ సంస్థ తరలింపుపై సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా వంటి నేతలు కూడా టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. అమర రాజా బ్యాటరీస్ తరలింపు లాభాల కోసమేనని, నిబంధనలు పాటించమంటే, పక్క రాష్ట్రాలకు తరలిపోతాము అంటే ఏం చేస్తాం అంటూ అమర రాజా బ్యాటరీస్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఇంతకాలం స్పందించని గల్లా జయదేవ్ ... సడన్ గా అది వదంతి అంటూ షాకింగ్ కామెంట్
అమర రాజా బ్యాటరీస్ తరలింపు వివాదంపై ఇన్ని రోజులుగా రాజకీయ రచ్చ కొనసాగుతున్నా తమ సంస్థకు సంబంధించి వస్తున్న వార్తలపై టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ స్పందించలేదు. ఇక తాజాగా చెన్నైకి అమర రాజ తరలింపు వదంతి మాత్రమేనని, వదంతులకు తాము స్పందించమని ఎంపీ జయదేవ్ చావు కబురు చల్లగా చెప్పారు. ఇంత రాజకీయ దుమారం చెలరేగినా, అలాంటిదేమీ లేదని ఒక చిన్న ప్రకటన కూడా చేయకుండా, ప్రస్తుతం అమర రాజా తరలింపు వదంతి అని చెప్పడం టిడిపికి బూమరాంగ్ గా భావించాల్సిన పరిస్థితి.

అమర రాజాపై రచ్చ చేసిన టీడీపీకి బూమరాంగ్
తాను వివాదాస్పద ప్రశ్నలు దూరంగా ఉంటానని, గత నెల రోజులుగా పత్రికలు, టీవీ ఛానళ్లలో ఒక వార్త ప్రచారం అవుతోందని, మంచి అయినా, చెడు అయినా దానిపై తాము స్పందించలేదని తెలిపారు. విషయం కోర్టు పరిధిలో ఉందని, కోర్టుకు సమాధానం చెబుతామని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. కోర్టు నిర్ణయం తర్వాత స్పందిస్తామని గల్లా జయదేవ్ వివరించారు. గల్లా జయదేవ్ చెప్పింది అంతా బాగానే ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్, కనీసం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఈ విషయం చెప్పలేదా అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ చెబితే అమర రాజా బ్యాటరీస్ తరలింపు గురించి టీడీపీ చేసిన రాద్ధాంతం కేవలం రాజకీయం కోసమేనా అన్నది మరో ప్రశ్న.

అమర రాజాతో అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలనుకుని ఇరుక్కుపోయిన టీడీపీ
అమరరాజా తరలింపు వదంతి మాత్రమేనని ప్రస్తుతం చెప్పిన గల్లా జయదేవ్, ఇదే విషయాన్ని అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు ఎందుకు చెప్పలేకపోయాడు అనేది మరో ప్రశ్న. మొత్తంగా అమరరాజా వ్యవహారంతో అధికార పార్టీని ఇరకాటంలో పెడదామని భావించిన తెలుగుదేశం పార్టీకి రివర్స్ షాక్ ఇచ్చింది. గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు టిడిపి నేతలను, ఏకంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును సైతం ఫూల్స్ ను చేశాయని ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

రాజకీయ కక్ష అంటూ ప్రచారం, తరలిపోతుంది అంటూ టీడీపీ ఆగ్రహం
జగన్ సర్కార్ రాజకీయ కక్షతో అత్యంత ప్రతిష్టాత్మకంగా, వేలాదిమందికి ఉపాధి నిస్తూ నిర్వహిస్తున్న అమర రాజా బ్యాటరీస్ సంస్థను ఇబ్బంది పెట్టిందని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నోటీసులతో సంస్థను మూసివేయాలని ఆదేశాలు ఇచ్చిందని, వేధింపులు భరించలేక అమర రాజా బ్యాటరీ సంస్థ తమిళనాడుకి తరలిపోతోంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిని ప్రచారం చేసి వైసీపీ సర్కార్ ఏపీకి నష్టం చేస్తుందని చూపించే ప్రయత్నం చేసింది. ఇక తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి గల్లా జయదేవ్ కు, తమిళనాడు రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, సంస్థ ఏర్పాటుకు సంబంధించి తాము సహకారం అందిస్తామని స్టాలిన్ చెప్పినట్లుగా వార్తలు పెద్దఎత్తున షికార్లు చేశాయి.

చిత్తూరులో తెలుగు తమ్ముళ్ళ ఆందోళనలు ,షాక్ ఇచ్చిన గల్లా వ్యాఖ్యలు
ఆ తర్వాత అమర రాజా బ్యాటరీస్ తరలింపు వ్యవహారం ఏపీలో పెను దుమారం అయింది. ఏకంగా చిత్తూరు జిల్లా వేదికగా తెలుగు తమ్ముళ్లు ఆందోళన బాట పట్టారు. అమర్ రాజా ఫ్యాక్టరీని తరలించవద్దని తరలింపును నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి నేతలు చిత్తూరు తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. నిత్యం టీడీపీ ముఖ్య నాయకులు జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పే ప్రయత్నం జోరుగా చేశారు . ఇక ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు అబ్బే అదేం లేదు అన్నట్టు ఉండటం తెలుగు తమ్ముళ్ళకు షాక్ అనే చెప్పాలి .
Recommended Video

గల్లా జయదేవ్ వ్యాఖ్యలను టార్గెట్ చేస్తున్న వైసీపీ .. ఇరుక్కున్న టీడీపీ
కేవలం వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అమర రాజా బ్యాటరీ ఫ్యాక్టరీని తరలి పోయేలా చేస్తున్నారని విమర్శించిన వేళ, సీఎం జగన్ మోహన్ రెడ్డిని వరుసపెట్టి టీడీపీ నేతలు టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వేళ, ఇప్పుడు గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారు అన్నది వైసీపీ నేతల ప్రశ్న. అనవసరపు రాద్ధాంతం చేయడంలో టీడీపీ దిట్ట అని వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్న వేళ, మరోమారు టీడీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వైసిపికి అనుకూలంగా మారగా, టీడీపీకి బూమరాంగ్ అయింది.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!










Click it and Unblock the Notifications