Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘జగన్! అమరావతిపై కుట్రలేలా?’

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినే వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పలువురు రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందనడంపై జగన్‌పై వారు మండిపడుతున్నారు.

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినే వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పలువురు రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందనడంపై జగన్‌పై వారు మండిపడుతున్నారు. రూ.లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలతో భూములు త్యాగం చేసిన తమలాంటి రాజధాని రైతులకు నష్టం కలుగుతుందని ధ్వజమెత్తారు.

దిష్టి బొమ్మ దహనం

దిష్టి బొమ్మ దహనం

తుళ్లూరులో ఆదివారం ప్రదర్శించిన రైతులు.. ‘జగన్‌ డౌన్‌, డౌన్‌.. రాజధానిని అడ్డుకుంటే ఖబడ్దార్‌' అంటూ నినాదాలు చేశారు. అనంతరం దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చినవారిలో అన్ని పార్టీలకు చెందిన రైతులున్నారని తెలిపారు. జగన్‌ వ్యాఖ్యలతో వారందరికీ ఆయనపై విరక్తి కలుగుతుందని చెప్పారు.

దొంగే దొంగ అన్నట్లు..

దొంగే దొంగ అన్నట్లు..

ఇది ఇలా ఉండగా, మంగళగిరి ఎర్రబాలెం నటరాజ కళామందిరం సెంటరులోనూ జగన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. వైసీపీ ప్లీనరీలో జగన్‌, ఆయన అనుచరులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంగళగిరి జడ్పీటీసీ ఆకుల జయసత్య మాట్లాడుతూ.. చంద్రబాబు మూడేళ్ల పాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ వైసీపీ పుస్తకాన్ని ఆవిష్కరించడం.. దొంగే దొంగ అన్న చందంగా వుందన్నారు.

అయినా బుద్ధిరాలేదా?

అయినా బుద్ధిరాలేదా?

రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా 33వేల ఎకరాలను ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక తన పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ద్వారా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నించారని ఆరోపించారు. చివరికి కోర్టులు సైతం ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన తీర్పును ఇచ్చినప్పటికీ వైసీపీ నేతలకు బుద్ధి రాలేదన్నారు.

వైసీపీ వారే గుర్రుగా..

వైసీపీ వారే గుర్రుగా..

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రాజధాని రైతులకు రాజకీయాలను దయచేసి ముడి పెట్టవద్దన్నారు. రాజధాని అన్నదాతల ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దని అన్నారు. జగన్‌కు రైతుల మీద ప్రేమ ఉండి, రైతు సమస్యలు పట్టించుకునే వారైతే ఎప్పుడో ముందుకి రావాల్సిందని అన్నారు. వైసీపీకి చెందిన రైతులే జగన్‌ తీరుపై గుర్రుగా ఉన్నారని వారు ఆరోపించారు. పార్టీలతో సంభధం లేకుండా రైతులు తమ ప్రాణాలకు సమానమైన భూమినిచ్చారని చెప్పారు. అంతేగాక, రాజధానిలో దళితులకు చంద్రబాబు పూర్తి న్యాయం చేశారన్నారు. అసైన్డ్‌ లంక రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చారని చెప్పారు.

చేతనైతే అండగా ఉండండి.. లేదంటే..

చేతనైతే అండగా ఉండండి.. లేదంటే..

అవినీతి జరిగిందనే ఆరోపణలతో దళిత రైతులకు కూడా నష్టం కలుగుతుందన్నారు. జగన్‌కి చేతనైతే రైతులకు అండగా ఉండాలని, సమస్యలపై గళం విప్పాలన్నారు. అంతేగాని ఆరోపణలు చేసి రాజధాని అభివృద్దిని అడ్డుకోవద్దని హితవు పలికారు. వేల మంది రైతుల ప్రయోజనాలను అడ్డుకోవద్దని అన్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల శ్రేయస్సును అందరూ కోరుకోవాలని, జగన్ వ్యాఖ్యలతో రాజధాని అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశాలున్నాయన్నారు. దీంతో రైతులే నష్టపోతారు. ఎంత త్వరగా అభివృద్ధి చెందుతుందా.. అని రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్, ఆయన పార్టీ నేతలు రాజధానిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధికి జగన్ సహకరించాలని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+