తుది ఘట్టానికి అమరావతి రైతుల పాదయాత్ర: బహిరంగసభపై హైకోర్టులో పిటీషన్ తో టెన్షన్; కార్యాచరణ ఇదే!!
ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సీఆర్డీఏ రద్దు నిర్ణయానికి, మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న అమరావతి రైతులు ప్రస్తుతం మహా పాదయాత్రను నిర్వహిస్తున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతి రైతుల సాగిస్తున్న మహాపాదయాత్ర తుది ఘట్టానికి చేరుకున్న వేళ, ఏం జరుగుతుందో అన్న ఆందోళన కొనసాగుతోంది.

43వ రోజు అమరావతి రైతుల పాదయాత్ర .. నేడు తిరుపతికి
సోమవారం నాడు అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహాపాదయాత్ర 43 వ రోజుకు చేరుకోవడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్రను ప్రారంభించారు. సోమవారం నాడు అమరావతి ప్రాంత రైతులు రేణిగుంట నుండి పాదయాత్రను ప్రారంభించి 12 కిలోమీటర్ల మేర తమ నడకను సాగించనున్నారు. ఇక ఈ రోజు పాదయాత్ర తిరుపతికి చేరుకోనుంది. ఇక సోమవారం జరుగుతున్న పాదయాత్రకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులతో కలిసి వారు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.

హైకోర్టులో అమరావతి రైతుల బహిరంగ సభపై పిటీషన్ .. సర్వత్రా ఉత్కంఠ
పాదయాత్రలో తుది ఘట్టం సమీపిస్తున్న సమయంలో భవిష్యత్తు కార్యాచరణపై రేణిగుంటలో అమరావతి పరిరక్షణ సమితి నాయకులు సమాలోచనలు జరిపారు. తిరుపతిలో ఈనెల 17వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని భావించిన అమరావతి ప్రాంత రైతులు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో, కోర్టు మెట్లు ఎక్కుతాం అని చెప్పిన అమరావతి రైతులు సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కోర్టు అనుమతితో సభను నిర్వహించి తీరుతాం అంటున్నారు.

డిసెంబర్ 15న 175 నియోజకవర్గాల్లో పాదయాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్రలు
తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని, తిరుపతి సభకు అందరూ ఆహ్వానితులేనని అమరావతి రైతులు పేర్కొంటున్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు . అమరావతిని రాజధానిగా కొనసాగించటం వల్ల రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా సాధ్యం అవుతుందో సభా వేదికగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా భారీ బహిరంగ సభకు అందరినీ ఆహ్వానిస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో డిసెంబర్ 15వ తేదీన ఉదయం 175 నియోజకవర్గాల్లో పాదయాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్రలు చేసి, ఆయా నియోజకవర్గాలలో మహాత్ముల విగ్రహాలకు నివాళులర్పించి రాష్ట్ర రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అన్న బలమైన ఆకాంక్షను వ్యక్తం చేయాలని నిర్ణయించినట్లుగా అమరావతి పరిరక్షణ సమితి నేతలు వెల్లడించారు.

అడుగడుగునా పోలీసుల ఒత్తిడి.. అయినా సరే ముందుకు వెళుతున్న రైతులు
తిరుమల పవిత్రతకు ఏ విధమైన ఇబ్బందీ కలగకుండా శ్రీవారి దర్శనానికి వెళ్తున్నామని వారు స్పష్టం చేశారు. పాదయాత్ర తుది ఘట్టానికి చేరుకున్న సమయంలో పోలీసుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని, అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారని అమరావతి ప్రాంత రైతులు ఆరోపించారు. తాము ఏ ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు రాజధాని అమరావతి రైతులు. విజయవాడలో కొంతమంది రాయలసీమ ధర్మదీక్ష చేయనున్నారని తెలిసిందని పేర్కొన్నారు. ప్రాంతీయ విభేదాలను సృష్టించడం తమ లక్ష్యం కాదని అమరావతి ప్రాంత రైతులు తేల్చిచెప్పారు.
Recommended Video

అమరావతి రైతులకు అడుగడుగునా ప్రజల సంఘీభావం
ఇదిలాఉంటే పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు అడుగడుగునా ప్రజలు సంఘీభావం తెలిపారు. ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు మాత్రమే కాకుండా వైసీపీ మినహా మిగతా రాజకీయ పార్టీల నేతలు కూడా అమరావతి రైతుల పాదయాత్రకు తమ మద్దతు ప్రకటించారు. కర్ణాటక, మహారాష్ట్ర నుండి ప్రవాసాంధ్ర రైతులు కూడా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. విరివిగా అమరావతి పోరాటానికి విరాళాలు కూడా అందిస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications