Amaravati: ఈసారి బాబునూ నమ్మని రైతులు ?మోడీకి కీలక డిమాండ్-మళ్లీ జగన్ వచ్చినా..?

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ఓవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీని సైతం అమరావతి పనుల పునఃప్రారంభానికి ఆహ్వానించింది. వచ్చే నెల 2న ప్రధాని మోడీ అమరావతి రానున్నారు. అయితే అమరావతి పనులు పునఃప్రారంభం అవుతుండటంపై సంతోషంగా ఉన్న స్థానిక రైతులు.. మరో విషయంలో మాత్రం లోలోపల అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం గతంలో ఎదురైన చేదు అనుభవాలే.

అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన గత టీడీపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. దీంతో ఆ తర్వాత టీడీపీ స్ధానంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి స్ధానంలో మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్దమైంది. ఇందుకోసం రెండు చట్టాలు కూడా చేసి ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకుంది. టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిపై గెజిట్ ఇవ్వలేదన్న విషయాన్ని అప్పటి వైసీపీ మంత్రులు, నేతలు పదే పదే ప్రస్తావించేవారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ అంశమే వారిని కలవరపెడుతోంది.

Amaravati farmers to demand pm modi to issue gazette notification on capital

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి పనులు ప్రారంభించినా భవిష్యత్తులో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే తిరిగి తమకు గత ప్రభుత్వ పరిస్ధితులు పునరావృతం అవుతాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. అలా కాకుండా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోలేదన్న భావన వారిలో నెలకొంది. దీంతో అమరావతి పనుల పునఃప్రారంభం కోసం వస్తున్న ప్రధాని మోడీ.. రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అలా అయితేనే భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా తమకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని వారు చెప్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని పట్టుబట్టి అమరావతి రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ ఇప్పిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+