విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు రాజధాని అమరావతి పంచాయితీ ... జేఏసీ నేతలు ఏం చెప్పారంటే

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని తరలింపు విషయంలో మొండి వైఖరిని అనుసరిస్తున్నారని రాజధాని రైతులు మండిపడుతున్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న రాజధాని ప్రజలను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. . ఒకపక్క రైతులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నా, ప్రతిపక్ష పార్టీలు రైతుల పక్షాన పోరాటం చేస్తున్నా అవేమీ పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ రాజధాని తరలింపు ప్రక్రియ మొదలు పెట్టిన వైసీపీ సర్కార్ కు బుద్ధి చెప్పాలని రాజధాని రైతులు నిర్ణయం తీసుకున్నారు.

రాజధాని అమరావతి పోరాటం... మనస్తాపంతో ఆగిన మరో రైతు గుండెరాజధాని అమరావతి పోరాటం... మనస్తాపంతో ఆగిన మరో రైతు గుండె

జాతీయ స్థాయిలో రాజధాని అమరావతి ఉద్యమం

జాతీయ స్థాయిలో రాజధాని అమరావతి ఉద్యమం

మరో రెండు మూడు నెలల్లోనే రాజధాని తరలింపు జరగబోతుంది. అందుకు పనులు కూడా వైజాగ్ లో మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. తమ ఆక్రందన ఏపీ సీఎం జగన్ వినకుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీకి వినిపిస్తాం అంటున్నారు. మొన్నటికి మొన్న రాష్ట్రపతికి అందరూ కారుణ్య మరణాలకు అంగీకరించాలని లేఖలు రాసి ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తెలిసేలా చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీకి రాజధాని రైతుల ఆవేదన తెలిపే యత్నం

ప్రధాని నరేంద్ర మోడీకి రాజధాని రైతుల ఆవేదన తెలిపే యత్నం

ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రికి నేరుగా రాజధాని రైతుల ఆవేదన తెలియజెయ్యాలని భావించారు అమరావతి ప్రాంత రైతులు. ఈ నేపధ్యంలోనే జేఏసీ నిర్ణయం తీసుకుంది .
రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న విషయాన్ని మోడీ దాకా తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు . మాన్ కీ బాత్ ద్వారా ప్రధానికి రాజధాని రైతుల మనసులో మాటను, ఏపీలో రైతుల పోరాటాన్ని తెలియజేయాలనుకున్నారు.

మాన్ కీ బాత్ ద్వారా ప్రధానికి రాజధాని రైతుల సందేశం

మాన్ కీ బాత్ ద్వారా ప్రధానికి రాజధాని రైతుల సందేశం

రాజధానిగా అమరావతికి మద్దతు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని 1800 11 7800 నంబరుకు ఫోన్‌ చేయాలని రాజధాని రైతుల జేఏసీ నిర్ణయించింది . ఈ మేరకు నిన్న తుళ్లూరు మహాధర్నాలో అమరావతి రైతుల వాయిస్ ను ప్రధానికి వినిపించనున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. 5 కోట్ల మంది ఆంధ్రుల అభిలాష అమరావతి అన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేలా చేసి అమరావతిని కాపాడుకుందామని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు .

రాజధాని రైతుల ఆవేదనపై ప్రధాని స్పందిస్తారనే ఆశాభావం

రాజధాని రైతుల ఆవేదనపై ప్రధాని స్పందిస్తారనే ఆశాభావం

ప్రధానికి ఇంట్లో నుండే సందేశాన్ని పంపమన్నారు. 1800 11 7800 నంబరుకు ఫోన్‌ చేసి బీప్‌ శబ్దం వినిపించిన తర్వాత వ్యక్తి పేరు, గ్రామం పేరు చెప్పి ‘‘ఐ సపోర్ట్‌ అమరావతి, సేవ్‌ ఫార్మర్స్‌ హూ సాక్రిఫైస్డ్‌ దెయిర్‌ ల్యాండ్స్‌'' అని చెబితే వాయిస్ రికార్డు అవుతుందని అది నేరుగా ప్రధానికి చేరుతుందని వారు పేర్కొన్నారు. ఈ వివరాలు ప్రధానమంత్రి ‘మన్‌ కీ బాత్‌' కార్యక్రమానికి చేరటం ద్వారా ప్రధాని ఈ వ్యవహారంపై స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు జేఏసీ నేతలు .

English summary
The capital farmers JAC has decided to call 1800 11 7800 on the central government to support Amaravati as the capital. JAC leaders announced that the voice of Amaravathi farmers will be send to PM. They announced at the Tullur Mahadarna yesterday. JAC leaders said to the people of ap to support amaravati and send voice messages to PM Modi's man ki baath program .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X