Amaravati: అమరావతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు చట్టబద్ధత కల్పించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం తర్వాత గెజిట్ ను విడుదల చేసింది. అమరావతి గెజిట్ ను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి ఇది అమలులోకి వస్తుందని ప్రకటనలో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఇక అమరావతి.. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం తర్వాత గెజిట్ ను విడుదల చేసింది. అంతకుముందు అమరావతి చట్టబద్ధత బిల్లు రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న విషయం తెలిసిదే. అయితే పరిశీలన, న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఇక ఏపీ పునర్విభజన చట్ట సవరణ 2026 బిల్లుకు పార్లమెంట్ లోని ఉభయ సభలు ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఇక ఇటీవల అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత అమరావతి ప్రాంత ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అందరూ సంబరాలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్.. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చినరోజు సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి ఈ విజయాన్ని జరుపుదామని పిలుపునిచ్చారు.

మంత్రి లోకేశ్ పిలుపుతో ప్రజలంతా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి ర్యాలీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సంబరాల్లో భాగంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని నినాదాలు చేశారు. కేక్ లు కట్ చేసి బాణసంచా పేల్చారు. విజయోత్సవ సంబరాల్లో కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాత్రం.. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు ప్రాంతంలో 'మావిగన్' పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలని సూచించిన విషయం తెలిసిందే..












Click it and Unblock the Notifications