అమరావతి రైతులకు ఊరట: వారు కోరుకున్నట్లే రాజధానిలో ప్లాట్లు

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి ఊరట లభించనుంది. రైతులకు ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా అభివృద్ధి చేసిన స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

రైతులకు ఇచ్చే స్థలాలు ఎంత వైశాల్యంలో ఉండాలి? తదితర అంశాల పైన అధికారులు, సిఆర్డీఏ దృష్టి సారించాయి. ఈ అంశం పైన రైతుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ రాజధాని ప్రాంత రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు.

వారి అభిప్రాయాలు తీసుకున్నారు. వాటి ఆధారంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నివాస, వాణిజ్య ప్రాంతాల్లో ఆరు విభాగాలుగా ప్లాట్లు ఉండే అవకాశముంది. స్థలాల వైశాల్యాన్ని ఖరారు చేసిన తర్వాత మిగతా విషయాలపై దృష్టి సారించనుంది.

Amaravati: Government taking farmers opinion on flats

రైతులను ఆదుకుంటాం: మంత్రులు

వరద బాధిత ప్రాంతాల్లో రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. కడప ఇంఛార్జ్ మంత్రి గంటా బుధవారం రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డితో కలిసి వరద నష్టాలను పరిశీలించారు.

భారీ వర్షాల కారణంగా తడిసి, రంగు మారిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని మంత్రి మాణిక్యాల రావు చెప్పారు. పశ్చిమ గోదావరిలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో ఆయన పర్యటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+