అమరావతి మారిపోయింది: టీ మంత్రి ఈటెల, ఏపీ మంత్రులకు పెళ్లి పిలుపు

Subscribe to Oneindia Telugu

అమరావతి: మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎంతో అభివృద్ధి చెందిందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తన కుమారుడు నితిన్ వివాహానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు, నేతలను ఆహ్వానించడానికి విజయవాడకు వెళ్లిన ఆయన.. మొదట ఏపీ సీఎం చంద్రబాబుకు పెళ్లి పత్రిక అందించారు.

మా నితిన్ పెళ్లికి రావాలి: చంద్రబాబును కలిసిన టీ మంత్రి ఈటెల

అనంతరం ఏపీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలను కూడా కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తాను మూడేళ్ల క్రితం అమరావతికి భూమిపూజ జరుగుతున్న సమయంలో వచ్చానని.. ఇప్పుడు ఇక్కడ చాలా అభివృద్ధి జరుగుతోందని అన్నారు.

Amaravati is developing, says Etela Rajender

రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి జరుగుతోందని ఈటెల రాజేందర్ చెప్పారు. ఏపీలో ఏరువాక దిగ్విజయంగా కొనసాగుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పెద్దవేమీ కాదని, త్వరలోనే పరిష్కారమవుతాయని ఆకాంక్షించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana minister Etela Rajender on Friday said that Amaravati is very well developing.
Please Wait while comments are loading...