• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమరావతికి ఆమ్‌స్టర్‌డామ్ స్ఫూర్తి: బాబు గురించి తెలుసని ఆఫ్ఘన్ మేయర్

|

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి నెదర్లాండ్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్ స్ఫూర్తిగా నిలవనుంది. అర్ధ శతాబ్ధం కింద ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆ నగరం ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇప్పుడు నదీతీర ప్రాంత నగరాల్లో మేటిగా ఆమ్‌స్టర్‌డామ్ నిలిచింది.

ఈ నగరం సముద్ర మట్టానికి 45 అడుగుల లోతులో ఉంది. నదీ పరీవాహానికి రెండు అడుగులు మాత్రమే ఎత్తులో ఉంది. దీంతో, వర్షం గట్టిగా కురిస్తే నగరంలో పడే నీరు నదిలోకి చేరేది కాదు. రాజధాని చుట్టుపక్కల వర్షాలు అధికంగా కురిస్తే సముద్రం ఆటుపోట్లు ఎదుర్కొని నగరాన్ని ముంచెత్తేంది.

ఈ కష్టాలనే వారు మెట్లుగా చేసుకొని ఎదిగారు. ఆమ్‌స్టర్‌డామ్‌.. విజయవాడ కంటే చిన్నది. నగరానికి ఒకపక్క నది. మరో పక్క సముద్రం ఉంది. అయిదు దశాబ్దాల కిందట అన్నింట్లో వెనుకబడినప్పటికీ, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు దూసుకెళ్తోంది.

రహదార్లను విస్తరించారు. ఆక్రమణలను ఏరివేశారు. కాలువలు ఏర్పడ్డాయి. క్రమంగా నది కంటే నగరం ఎత్తు పెరిగింది. నీరు నదిలో కలిసింది. ఇప్పుడు కాలువలే అక్కడి వారి ప్రధాన రవాణా మార్గం. పర్యావరణ రక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. చెట్లను పెంచుతారు.

గతంలో ఆమ్‌స్టర్‌డామ్‌కు ఉన్న సమస్యే ఇప్పుడు అమరావతికి ఉంది. ఓ పక్క కృష్ణానది, కొండవీటి వాగులు భవిష్యత్తులో ఇబ్బందులు కలిగించే అవకాశముంది. కృష్ణానదికి వరద నీరు వస్తే రాజధానికి కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు లేకపోలేదు.

ఇటీవల నెదర్లాండ్స్‌ ప్రతినిధులు ఏపీ సీఆర్డీఏ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌కు వారి కితాబు లభించింది. అమరావతి భవిష్యత్తులో మరో ఆమ్‌స్టర్‌డామ్‌ అవుతుందని చెప్పారు. అదే సమయంలో ముంపు నివారణ విషయంలో తీసుకున్న జాగ్రత్తలను వివరించారు.

 కజకిస్తాన్‌లో బాబు

కజకిస్తాన్‌లో బాబు

అమరావతి నిర్మాణానికి కజకిస్థాన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అస్తానా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య పరస్పర సహకారానికి కార్యాచరణ బృందం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌, అస్తానాలు నిర్ణయించాయి.

కజకిస్తాన్‌లో బాబు

కజకిస్తాన్‌లో బాబు

ప్రపంచ నగరాల్లో నిర్మాణశైలిలో అద్భుతంగా ప్రశంసలు పొందిన కజకిస్థాన్‌ రాజధాని అస్తానాలో సీఎం చంద్రబాబు బృందం అదివారం పర్యటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అస్తానా మేయర్‌ అస్సెట్‌ లెస్కెష్కోవ్‌తో భేటీ అయ్యారు.

కజకిస్తాన్‌లో బాబు

కజకిస్తాన్‌లో బాబు

అమరావతి నగర నిర్మాణానికి ఉభయులూ వచ్చేనెలలో ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు.

 కజకిస్తాన్‌లో బాబు

కజకిస్తాన్‌లో బాబు

ఆంధ్రప్రదేశ్ తరఫున వర్కింగ్‌ గ్రూపునకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నేతృత్వం వహిస్తారు.

 కజకిస్తాన్‌లో బాబు

కజకిస్తాన్‌లో బాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... గత ఏడాది భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ పర్యటించి ఈ నగర నిర్మాణ కౌశలాన్ని ప్రశంసించారని, నగరాన్ని సందర్శించాలని తనకు గుర్తు చేశారన్నారు.

కజకిస్తాన్‌లో బాబు

కజకిస్తాన్‌లో బాబు

అస్తానా మేయర్‌ ఇష్కెషోవ్‌ మాట్లాడుతూ.. వర్కింగ్‌ గ్రూపులో తమ సభ్యులను రెండు రోజులో ప్రకటిస్తామన్నారు. వచ్చే ఏడాది ఎక్స్‌పో- 2017 అస్తానాలో నిర్వహించనున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పక హాజరుకావాలన్నారు. ఇందుకు చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారు.

కజకిస్తాన్‌లో బాబు

కజకిస్తాన్‌లో బాబు

అస్తానా మేయర్‌ మాట్లాడుతూ.. భారత రాజకీయాల్లో చంద్రబాబు క్రియాశీల పాత్ర మాకు తెలుసునని, ఐటీ, సాంకేతిక రంగాల్లో మీరు చూపిన చొరవ తమ దృష్టి వచ్చిందని ప్రశంసించారు. మీతో సంబంధాలు నెరపాలని భావిస్తున్నామన్నారు.

 కజకిస్తాన్‌లో బాబు

కజకిస్తాన్‌లో బాబు

తమ దేశ రవాణాశాఖ మంత్రితో మాట్లాడి అస్తానా నుంచి అమరావతికి నేరుగా విమాన సర్వీసు నడిపేందుకు ప్రయత్నిస్తానన్నారు. అనంతరం కజకిస్థాన్‌ రాయబారి ఆయనకు ఘనస్వాగతం పలికి అల్పాహార విందు ఇచ్చారు.

English summary
Amaravati likely to be developed on par with Astana, capital of Kazakhstan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X