అమరావతిలో ఉద్భవ్ ఉత్సవాలు..! ఏకలవ్య స్కూళ్ల విద్యార్ధుల సందడి..!
గిరిజన విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు కూడా నేర్చుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జ్యూయల్ ఓరమ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏకలవ్య మోడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్ధులకు నిర్వహిస్తున్న ఉద్భవ్ 2025 ఉత్సవాలు అమరావతిలోని కేఎల్ యూనివర్శిటీలో ఇవాళ ఆయన ప్రారంభించారు. జవహర్ లాల్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్ల తరహాలోనే ఈఎంఆర్ఎస్ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు.
ఎంతో కష్టపడి ఉత్సవాలలో లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తోన్న ఏపీ ప్రభుత్వం, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎం.మల్లికార్జున నాయక్ లను కేంద్రమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా 6వ జాతీయ ఈఎంఆర్ఎస్ సంస్కృతి, సాహిత్య, కళా ఉత్సవాన్ని జువల్ ఓరమ్ ఆవిష్కరించారు. అనంతరం కేంద్రమంత్రిని రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణి సన్మానించారు. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఆయనకు బహూకరించారు.

అంతకుముందు ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర మంత్రి ఓరమ్ ను ఈఎంఆర్ఎస్ విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన సభా ప్రాంగణం వద్ద గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. బొమ్మల్ని పరిశీలించారు. విల్లును పట్టుకుని బాణాన్ని ఆకాశానికి ఎక్కుపెట్టి కేంద్రమంత్రి ఓరమ్ సందడి చేశారు. అక్కడే ఏర్పాటైన గిరిజనుల ఉత్పత్తిగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అరకు కాఫీ స్టాల్ ను సందర్శించారు. దాంతో పాటు గిరిజనుల ఉత్పత్తి అయిన తేనే బాటిళ్లను పరిశీలించారు.

ఉద్భవ్-2025 అంటే వేడుక కాదని, గొప్ప మార్పుకు వేదిక అని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తెలిపారు. చిన్నారులలోని ప్రతిభ, సృజనాత్మకతను బయటకి తీసి విశ్వాసం నింపాలనేదే లక్ష్యమన్నారు. కొత్త పరిచయాలు, కొత్త సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం ఈ ఉత్సవం వల్ల సాధ్యపడుతుందన్నారు. 405 ఈఎంఆర్ఎస్ స్కూళ్ల నుంచి 1647 మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొనే వేదిక ఏపీ కావడం సంతోషకరమన్నారు. 110 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నట్లు ఆమె వెల్లడించారు. 28 లక్షల మంది గిరిజనులున్న ఏపీలో ఉద్భవ్ -2025కు ఆతిథ్యమిస్తున్నందుకు గర్వపడుతున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.మల్లికార్జున నాయక్ పేర్కొన్నారు. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వల్ల మనలోని వైవిధ్యాన్ని పెంపొందిస్తాయన్నారు.
-
తెలంగాణా విద్యార్థులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్న భోజనంలో చేపలు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications