Ambati Rambabu: అంబటి రాంబాబు ఇంటి దాడిపై హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీలో కల్తీ నెయ్యి కేసులో సిట్ రిపోర్ట్ తర్వాత వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu)ను టీడీపీ క్యాడర్ అడ్డుకోవడం, ఆయన చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఆయన ఇంటిపై టీడీపీ క్యాడర్ దాడి జరిగాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు నగరంలోని అంబటి రాంబాబు ఇంట్లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. అనంతరం అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి నేపథ్యంలో తనతో పాటు 60 మంది కార్యకర్తలకు పోలీసులు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన భార్య హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం అంబటి రాంబాబు ఇంటికి 24 గంటల పాటు రక్షణ కల్పించాలని ఆదేశాలు కూడా ఇచ్చింది.

అంబటి రాంబాబు భార్య దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ విచారణ సందర్బంగా శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే వరకూ ఆయన ఇంటికి 24 గంటలూ భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు అదనపు భద్రత కల్పిస్తున్నారు. మరోవైపు ఇవాళ మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపైనా టీడీపీ కార్యకర్తలు దాడులు చేసి నిప్పంటించిన నేపథ్యంలో వైసీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ పార్టీకి చెందిన మాజీ మంత్రుల ఇళ్లపై జరుగుతున్న దాడులపై రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications