హోంమంత్రి అనిత కులంపై అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్
ఏపీ హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.హోంమంత్రి అనితపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని తమ పార్టీ కార్యకర్తలపై ఎస్టీ, ఎస్సీ ఎట్రాసిటీ కేసులు పెట్టారని , అయితే అనిత కులం ఏమిటో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. తాను బైబుల్ పట్టుకు తిరుగుతానని ఆమే చెప్పారని , ఇదే అనిత తర్వాత తాను హిందువనని చెప్పారని, ఇందులో ఏది నమ్మలని ఆయన ప్రశ్నించారు.
తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టే సరికి ఆమె ఎస్సీ అయిపోయారని విమర్శించారు.ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దుర్మార్గమైన పయత్నాలు చేస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. హోంమంత్రి అనిత చేతిలో ఏముండదని, అంతా మంత్రి నారా లోకేశ్ చేస్తున్నారని ఆరోపించారు. కూటమి నేతలపై పోస్టులు పెడుతున్నారని అరెస్ట్ చేస్తున్నారని.. జగన్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తలు పెట్టిన పోస్టులపై ఎందుకు చర్యలు తీసుకోరని అంబటి ప్రశ్నించారు. జగన్ పై గతంలో అయ్యన్నపాత్రుడు కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేశారని... ఆయనపై కూడా ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

జగన్‌పై గతంలో అయ్యన్నపాత్రుడు కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేశారని... ఆయనపై కూడా ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. జగన్‌పై గతంలో అయ్యన్నపాత్రుడు కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేశారని... ఆయనపై కూడా ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని... న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications