వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లిన తిట్టినోళ్లతో తమ్ముడు రాజీపడితే.. చిరు కామెంట్స్ పై అంబటి షాకింగ్ ట్వీట్..

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాలతో నాకేం పనంటూ మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. చిరంజీవి వ్యాఖ్యల్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ రియాక్ట్ అవుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ నేతలు, మంత్రులు కూడా ఒక్కొక్కరుగా చిరు అనూహ్య వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.

తన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య విడుదల నేపథ్యంలో ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తాను తెంలంగాణలో ఉన్నానని, ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం లేదని మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంతో తనకు తెలియదన్నారు. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదన్నారు. అయితే గతంలో తన తమ్ముడు పవన్ కు అండగా ఉండేందుకే తాను రాజకీయాలకు విశ్రాంతి ఇచ్చినట్లు చిరంజీవి ప్రకటించారు. తాజాగా విశాఖలో ఇల్లు కట్టుకుంటానంటూ వాల్తేరు వీరయ్య ఫంక్షన్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాత్రం రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నారు. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

ambati rambabu shocking tweet on chiranjeevis comments on politics, drags pawan kalyan

చిరు కామెంట్స్ పై స్పందిస్తూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. ఇందులో తల్లిని దూషించిన వారితో తమ్ముడు రాజీపడితే అన్నయ్యకు రాజకీయాల పట్ల విరక్తి పుట్టిందేమో..అంటూ అంబటి కౌంటర్ ఇచ్చారు. తద్వారా గతంలో టీడీపీతో విడిపోయిన సందర్భంగా పవన్ కళ్యాణ్, నాగబాబు చేసిన వ్యాఖ్యలు.. దానికి టీడీపీ నేతలు వీరి తల్లిని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యల్ని మరోసారి తెరపైకి తెచ్చారు. తద్వారా తల్లిని దూషించిన టీడీపీ నేతలతో తమ్ముడు పవన్ కళ్యాణ్ జత కట్టడాన్ని జీర్ణించుకోలేక చిరంజీవి రాజకీయాలపై విరక్తి తెచ్చుకున్నారా అనే అర్ధం వచ్చేలా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయి.

English summary
ap minister ambati rambabu on today put a tweet on chiranjeevi's recent comments on politics. drags his brother pawan kalyan also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X