ట్రంప్ కు ఆదర్శం ఎన్టీఆర్: ఒక్క డాలర్ జీతం

హైదరాబాద్/వాషింగ్టన్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదర్శంగా తీసుకున్నారు.

నేను యూఎస్ అధ్యక్షుడైన తరువాత తీసుకునే జీతం ఎంత ? అనే విషయం డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కేవలం ఒక్క అమెరికన్ డాలర్ మాత్రమే తాను జీతంగా తీసుకుంటానని ట్రంప్ మీడియాకు చెప్పారు.

తెలుగు జాతి కీర్తిని ప్రంపంచానికి చాటి చెప్పి తెలుగు సినీరంగంలో మకుటంలేని మహారాజుగా వెలిగిన నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయిన విషయం తెలిసిందే.

America President elect Donald Trump: Will take $1 Salary as President

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అన్నగారు నెలకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని అప్పట్లు ప్రకటించారు. ఒక్క రుపాయి జీతం తీసుకున్న అన్నగారు ఎన్టీఆర్ అప్పట్లో దేశంలోని ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారు.

ఈ విషయాన్ని అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు ప్రముఖుడు డోనాల్డ్ ట్రంప్ చెవిలో వేశారని సమాచారం. అంతే మీడియా సమావేశం పెట్టిన డోనాల్డ్ ట్రంప్ తాను ఒక్క అమెరికన్ డాలర్ మాత్రమే జీతంగా తీసుకుంటానని ప్రకటించి ఆందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

అమెరికా అధ్యక్షుడికి సంవత్సరానికి నాలుగు లక్షల అమెరికన్ డాలర్లు (రూ. 2.60 కోట్లు) వేతనంగా ఇస్తారు. అయితే ఆ జీతం తనకు వద్దు అని ట్రంప్ అన్నారు. ఒక్క అమెరిక్ డాలర్ మాత్రమే (దాదాపు రూ. 65 రుపాయలు) వేతనంగా తీసుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన నందమూరి తారకరామారావు నెలకు ఒక్క రుపాయి జీతం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేను ఒక్క అమెరికన్ డాలర్ మాత్రమే జీతంగా తీసుకుంటానని ప్రకటించారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన అన్నగారిని ట్రంప్ ఆదర్శంగా తీసుకున్నారు.

నాకు వేతనం కంటే దేశానికి సేవ చెయ్యడం ఎంతో ముఖ్యమని ట్రంప్ అన్నారు. అధ్యక్షుడిగా తనకు వచ్చే జీతం తీసుకునేకంటే దేశ ప్రజలకు సేవ చెయ్యడంలో ఎంతో ఆనందం ఉంటుందని ట్రంప్ వివరించారు.

తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన అన్నగారిని ఆదర్శంగా తీసుకుంటున్న ట్రంప్ ఆయన లాగే మంచి పేరు తెచ్చుకుంటారా ? అంటూ కోందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రంప్ ను ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+