ఏలూరులో ఏం జరుగుతోంది?: జగన్ పర్యటన -వీడని మిస్టరీ -సీఎంకు వింతరోగమంటూ విమర్శలు
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అంతుచిక్కని వ్యాధి భయాందోళనలు రేపుతున్నది. శనివారం రాత్రికిరాత్రే వందలమంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. మూర్ఛ(ఫిట్స్)కు గురవుతూ, వాంతులు చేసుకుంటూ వందల మంది ఆస్పత్రులకు పరుగులు తీశారు. ఆదివారం రాత్రి 7గంటల వరకు రోగుల సంఖ్య 270కి పెరిగింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వస్తోందని ప్రభుత్వం చెబుతున్నా, ప్రజల్లో గుబులు తగ్గలేదు. అసలిలా ఎందుకు జరిగిందో, వందల మంది ఒకేసారి ఆస్పత్రులపాలు కావడానికి కారణాలేంటో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగారు..
Recommended Video

ఏలూరుకు సీఎం జగన్..
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని అస్వస్థతల వ్యవహారాన్ని శనివారం రాత్రి నుంచి సమీక్షిస్తోన్న సీఎం జగన్.. సోమవారం నేరుగా పట్టణానికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్.. ఉదయం 10:20 గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని, అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. ఆ వెంటనే, హెల్త్ క్రైసిస్ కు సంబంధించి స్థానిక జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు. కాగా ప్రస్తుతం..

పెరిగిన డిశ్చార్జిలు.. కొందరికి విషమంగా..
ఏలూరులో మిస్టరీ అస్వస్థలపై ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని పడమర వీధి, కొత్త వీధి, దక్షిణ వీధిలో లక్షణాలు అధికంగా కనిపించాయని, ఇప్పటివరకు బాధితుల సంఖ్య 270కి చేరిందని, అస్వస్థతకు గురైన ఆస్పత్రుల్లో చేరిన బాధితుల్లో చాలా మంది కోలుకుంటున్నారని తెలిపారు. ‘‘ఆదివారం రాత్రి వరకు మొత్తం 117 మందిని డిశ్చార్జ్ అయ్యారు. సమస్య ఉత్పన్నమైన ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్‌లు పెట్టాం. ప్రస్తుతానికి ఎవరికి ప్రాణాపాయం లేదు. కానీ, ఐదుగురికి రిపీటెడ్‌గా ఫిట్స్ వస్తున్నాయి. కిడ్నీ, ఇతర వ్యాధులు ఉన్నవారి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం వాళ్లను విజయవాడకు తరలించాం. వైద్యసిబ్బంది అలుపెరగకుండా సేవలు అందిస్తున్నారు''అని ఆరోగ్య మంత్రి చెప్పారు. అయితే..

అసలేం జరిగిందంటే..
ఏలూరులో అస్వస్థతలు ఎందుకు తలెత్తాయనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. నగరంలో నీరు కలుషితం కావడం లేదా ఫుడ్ పాయిజన్ లాంటివి ఏమీ జరగలేదని, బాధితులకు చేసిన రక్త పరీక్షల్లో ఎలాంటి ఎఫెక్ట్ లేదని ఆరోగ్య మంత్రి చెప్పారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకుగానూ.. అస్వస్థతకు గురైనవారి శాంపిళ్లను టెస్టుల కోసం వైరాలజీ ల్యాబ్‌కు పంపించామని, కల్చర్ సెల్స్ సెన్సిటివిటి టెస్ట్(సెల్ కల్చర్ టెస్ట్) రిపోర్టులు వెల్లడైతేగానీ, రోగం ఏమిటన్నది బయటపడుతుందని మంత్రి చెప్పారు. ఇప్పటికే విజయవాడ ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందం ఏలూరుకు చేరుకోగా, వైరాలజీ నిపుణుల బృందాలు కూడా ఏలూరు రానున్నాయి. మరోవైపు, ఏలూరు అస్వస్థలపై కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా,

‘మాస్ హిస్టీరియా' కామెంట్లపై భగ్గు..
ఏలూరు అస్వస్థతలపై తుది రిపోర్టులు రాకముందే పట్టణంలో కలుషిత నీరు లేదని, ఫుడ్ పాయిజన్ జరగలేదని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్షాలు ఫైరయ్యాయి. ఏలురు ఘటనను మాస్ హిస్టీరియాగా కొదరు వైసీపీ నేతలు అభివర్ణించడాన్ని విపక్ష నేతలు తప్పుపట్టారు. సురక్షితమైన తాగునీరు ఇవ్వలేని జగన్‌రెడ్డి పాలన వల్లే చిన్నారులు సహా వందలమంది అస్వస్థతకు గురయ్యారని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. అస్వస్థతలకు కారణం మాస్ హిస్టీరియా కాదని.. టాక్సీన్లతో కలిగిన అస్వస్థత అయి ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఏలూరు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి పరిస్థితిని అదుపులో ఉంచాలని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య అన్నారు. ఏలూరు ఆస్పత్రిలో రోగులను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పరామర్శించారు. ఈక్రమంలోనే..

ముఖ్యమంత్రికి వింత రోగం..
అస్వస్థలపై ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం నేరుగా ఏలూరు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ ను ఉద్దేశించి సంచలన ఆరోపణలు, విమర్శలుచేశారు. ‘‘వింత రోగం వచ్చింది ప్రజలకు కాదు, ముఖ్యమంత్రి జగన్‌కే. తన చేతగాని తనం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఏలూరు లో వింత రోగం వచ్చిందని, మాస్ హిస్టీరియా తలెత్తిందని ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి తెరలేపింది. నీటిలో, గాలిలో లోపం లేదంటోన్న వైసీపీ.. అసలు లోపం తమకు ఓటేసిన ప్రజల్లోనే ఉందని చెప్పడం, పారిశుద్ధ్య లోపాలను ప్రజలపైకి నెట్టేయడం దారుణం '' అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications