టీడీపీలో ఇక అంతా వారే..! కీలక నేతలపై తేల్చేసిన లోకేష్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తోంది. ఈ ఏడాదిన్నరలో కూటమి పార్టీల నేతలు రాష్ట్ర స్ధాయిలో పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నా క్షేత్రస్ధాయిలో మాత్రం గ్యాప్ ఉన్నట్లు అర్దమవుతోంది. అలాగే జిల్లా ఇన్ చార్జ్ మంత్రులతో సైతం జోనల్ కోఆర్డినేటర్ల గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జోనల్ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించారు.

టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో నారా లోకేష్ నిర్వహించిన భేటీలో పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. ఇందులో కార్యకర్తల్ని ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీకి కార్యకర్తే అధినేత అని లోకేష్ తేల్చేసారు. ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉండాలన్నారు. ప్రతిపక్షంలో ఉండి పోరాడినట్లే జోనల్ కోఆర్డినేటర్లు పనిచేయాలని కోరారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో నిర్లక్ష్యం వద్దని, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రణాళిక మేరకు పనిచేయాలని సూచించారు.

Amid NDA Rift Reports Nara Lokesh Sends Message to TDP Zonal Heads

మరోవైపు ఇన్‌ఛార్జ్ మంత్రులతో సమన్వయం గ్యాప్ లపైనా లోకేష్ చర్చించారు. అనంతరం ఇవ్ చార్జ్ మంత్రులతో కలిసి వ్యూహరచన చేయాలని సూచించారు. దీంతో పాటు జోనల్ కో ఆర్డినేటర్లు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట టీడీపీ ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇంకా ఖాళీగా ఉన్న స్థానాలకు టీడీపీ ఇన్‌ఛార్జ్‌లను త్వరలో నియమిస్తామని లోకేష్ సంకేతం ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్లి పార్టీ వ్యవహారాలపై జోనల్ కోఆర్డినేటర్లు సమీక్షించాలన్నారు.

Amid NDA Rift Reports Nara Lokesh Sends Message to TDP Zonal Heads

అలాగే ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించేలా జోనల్ కోఆర్డినేటర్లు పర్యవేక్షించాలని లోకేష్ ఆదేశించారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు సమన్వయం పెంచే బాధ్యత జోనల్ కోఆర్డినేటర్లదేనని తేల్చేశారు. జోనల్ కోఆర్డినేటర్ల పనితీరును ప్రతి నెలా సమీక్షిస్తానని లోకేష్ తెలిపారు. పార్టీకి అన్నీ తామై జోనల్ కోఆర్డినేటర్లు వ్యవహరించాలన్నారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై సమీక్షించి చట్టపరంగా పరిష్కరిద్దామని వారికి సూచించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పార్టీ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తామని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యాలయాలకు స్థలాలు గుర్తించి నిర్మాణాలు చేపట్టాలని కూడా కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+