అమిత్ షా తో పవన్, చిరంజీవి కీలక భేటీ - రాంచరణ్ తో సహా.. ప్రత్యేక ఆహ్వానం వెనుక..!!

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి.. రాంచరణ్ తో లంచ్ మీట్ కీలకంగా మారుతోంది. ఏపీలో ఎన్డీఏలో జనసేన భాగస్వామిగా ఉంది. తెలంగాణ లో మాత్రం జనసేన రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. బీజేపీ తమకు ఎవరితో పొత్తులు ఉండవని చెబుతోంది. ఈ సమయంలో చిరంజీవితో సహా పవన్ అమిత్ షా తో భేటీ కావటం వెనుక రాజకీయం పైన ఆసక్తి కర చర్చ మొదలైంది.

బెంగళూరు ఎమ్మెల్సీ లో కాంగ్రెస్ భారీ ఓటమి: మిగిలిన చోట్లా బీజేపీ-జేడీఎస్ క్లీన్ స్వీప్
బెంగళూరు ఎమ్మెల్సీ లో కాంగ్రెస్ భారీ ఓటమి: మిగిలిన చోట్లా బీజేపీ-జేడీఎస్ క్లీన్ స్వీప్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగే మహా పాదయాత్రలో అమిత్ షా పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. కాకతీయ హోటల్ లో పలవురు ప్రముఖులతో లంచ్ మీట్ ఏర్పాటు చేసారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో పాటుగా చిరంజీవి, రాం చరణ్ ను ఆహ్వానించారు.

బీజేపీ ముఖ్య నేతలకు అధిష్ఠానం పిలుపు - కీలక మలుపు..!!
బీజేపీ ముఖ్య నేతలకు అధిష్ఠానం పిలుపు - కీలక మలుపు..!!
Amit Shah Meeting with Pawan Kalyan Chiranjeevi and Ram Charan Sparks Political Interest

గతంలో ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు తరువాత చిరంజీవి- రాం చరణ్ ఢిల్లీలో అమిత్ షా తో భేటీ అయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా కలిసారు. ఇక.. ఇప్పుడు చిరంజీవి.. పవన్ తో పాటుగా రాం చరణ్ తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కావటం రాజకీయ భవిష్యత్ వ్యూహాల్లో కీలకంగా భావిస్తున్నారు.

ప్రధాని మోదీ సైతం చిరంజీవి పైన పలు సందర్భాల్లో ప్రత్యేక అభిమానం చూపించారు. ఇక, పవన్ అనేక సందర్భాల్లో ప్రధాని మోదీ- అమిత్ షా పైన తన గౌరవం చాటుకున్నారు. అటు ఏపీలో ఎన్డీఏలో బీజేపీ, జనసేన కలిసి ఉన్నా.. తెలంగాణలో మాత్రం రాజకీయంగా వేర్వేరుగానే కొనసాగుతున్నారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకూ వేర్వేరుగా సిద్దం అవుతున్నారు.

పవన్ తమ అభ్యర్ధిని ప్రకటించారు. ఈ క్రమంలో అమిత్ షా ప్రత్యేకంగా పవన్- చిరంజీవితో భేటీ వెనుక రాజకీయంగా చర్చ సాగుతోంది. అయితే, ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమేనని బీజేపీ రాష్ట్ర నేత లు చెబుతున్నారు. అయితే.. చిరంజీవి, రాం చరణ్ సైతం ఈ భేటీలో పాల్గొనటం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు సినీ.. ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త డిబేట్ కు కారణం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+