కౌంటర్: 4 ఏళ్ళుగా సహయంపై అమిత్ షా సమాధానం, బాబుకు బిజెపి లెటర్?
అమరావతి:ఎన్డీఏ నుండి బయటకు వచ్చే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాశారు అయితే ఆ లేఖకు బిజెపి సమాధానం ఇవ్వనుంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం నాడు ఈ లేఖను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయడంలో బిజెపి సక్రమంగా వ్యవహరించనందుకు నిరసనగా ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చింది. ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన వెంటనే కేంద్రంపై టిడిపి అవిశ్వాస తీర్మాన నోటీసును కూడ ఇచ్చింది.
కొంత కాలంగా టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. చివరకు ఎన్డీఏ నుండి టిడిపి వెలుపలకు వచ్చింది. ప్రత్యేక హోదా అంశాన్ని లక్ష్యంగా చేసుకొని పోరాటం చేస్తోంది.

బాబుకు అమిత్ షా కౌంటర్
ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి ఏ మేరకు నిధులిచ్చామనే విషయమై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కౌంటర్ ఇవ్వనున్నారు. ఎన్డీఏ నుండి బయటకు వెళ్ళేందుకు గల కారణాలను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాసిన లేఖలో బాబు ప్రస్తావించారు. అయితే బాబు రాసిన లేఖకు అమిత్ షా కౌంటర్ లేఖను సిద్దం చేశారని సమాచారం. అమిత్ షా ఈ లేఖను గురువారం నాడు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

భవిష్యత్‌లో చేసే సహయం కూడ ప్రస్తావించనున్నారు
ఇప్పటివరకు ఏపీ రాష్ట్రానికి చేసిన సహయంతో పాటు రానున్న రోజుల్లో ఏపీ రాష్ట్రానికి చేయాల్సిన సహయానికి సంబంధించిన విషయాలపై తన లేఖలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తావించే అవకాశాలున్నాయి.

ఎన్నికల కోసమే అవిశ్వాసం
ఎన్నికల కోసమే కేంద్రంపై టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిందని ఏపీ బిజెపి అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు చెప్పారు. లోక్‌సభ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే ఏపీ రాష్ట్రానికి ఏం చేశామనే విషయాన్ని చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని హరిబాబు చెప్పారు.

సభపైనే అవిశ్వాసం ఆధారపడి ఉంటుంది
అవిశ్వాసం చర్చకు వస్తే తమకు కూడ ప్రయోజనమని ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు.టిడిపి తమపై చేస్తున్న ఆరోపణలకు తాము సమాధానం చెప్పే వీలు చిక్కుతోందని హరిబాబు చెప్పారు. అయితే అవిశ్వాసం సభలో చర్చకు వస్తోందా, రాదా అనే విషయమై సభ జరిగే తీరుపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ, టిడిపిలు వ్యూహరచనలో భాగంగానే ఈ అంశాన్ని తీసుకొన్నాయని హరిబాబు ఆరోపించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications